Site icon HashtagU Telugu

‎Anjeer: అంజీర్ పండ్లను తక్కువ అంచనా వేస్తున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Anjeer

Anjeer

‎Anjeer: అంజీర్ పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. ‎అంజీర్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇతర పోషకాలకి అద్భుతమైన మూలం అని చెప్పాలి. ఇవి తియ్యగా ఉంటాయి. అంజీర్ పండ్లు మాత్రమే కాకుండా డ్రై అంజీర్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డ్రై అంజీర్‌ లో 24 గ్రాముల చక్కెరని అందిస్తాయి. అయితే ఇందులోని హై ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిల ప్రభావాన్ని తగ్గిస్తాయట. అంజీర్ పండ్లలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది.

‎దీని వల్ల జీర్ణక్రియ మెరుగ్గా మారుతుందట. మలబద్ధకంతో బాధపడేవారు రెగ్యులర్‌ గా ఈ పండ్లని తింటే జీర్ణక్రియ మెరుగ్గా జరిగి నేచురల్‌ గానే మలబద్దకం దూరమవుతుందని చెబుతున్నారు. అంజీర్‌ లో ఫైబర్‌ తో పాటు ముఖ్య ఖనిజాలు ఉంటాయట. అంతేకాకుండా తక్కువ మొత్తంలో కాపర్, మాంగనీస్, ఐరన్, విటమిన్ కె, మెగ్నీషియం, కాల్షియంలు ఉంటాయని అంజీర్ పండ్లు తింటే మీ గట్‌ లో మంచి బ్యాక్టీరియాని పోషించే ప్రీబయోటిక్ పోషకాలు అందుతాయట. హెల్దీ మైక్రోబయోమ్ తక్కువ వాపు, మెరుగైన ఇమ్యూనిటీని అందిస్తుందట. వీటిని తినడం వల్ల ప్రేగు నొప్పి, ప్రేగు కదలికలు ఈజీ అవుతాయని చాలా వరకూ కడుపు సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు.

‎అలాగే ఫిగ్స్ తినడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుందట. ఇందులోని గుణాలు మంచి కొలెస్ట్రాల్‌ ని పెంచి చెడు కొలెస్ట్రాల్‌ ని తగ్గిస్తాయట. అంతేకాకుండా ట్రైగ్లిజరైడ్స్‌ ని తగ్గించడం వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందని చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ గుండె ఆరోగ్యానికి మంచిదట. దీనిని తీసుకోవడం వల్ల పెద్దప్రేగు కాన్సర్, గుండజబ్బులు, టైప్ 2 డయాబెటిస్ కూడా తగ్గుతుందని చెబుతున్నారు. ఫిగ్స్‌లో పొటాషయం కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల బీపి చాలా వరకు తగ్గుతుందట. గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుందని, అంతేకాదు అంజీర్ పండ్లలో కాల్షియం ఎక్కువగా ఉంటుందని, దీంతో ఈ పండ్లని తింటే ఎముకలు బలంగా మారతాయని, దీని కారణంగా బోలు ఎముకల సమస్య తగ్గుతుందని చెబుతున్నారు.

‎రక్తంలో షుగర్‌ ని బ్యాలెన్స్ చేయడానికి అంజీర్ పండ్లు చాలా హెల్ప్ చేస్తాయట. టైప్ 1 డయాబెటిస్‌తో బాధపడేవారు అంజీర్ ఆకు టీ తాగిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయట. మొత్తం అంజీర్ పండు టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి కూడా మంచి చేస్తుందని, షుగర్ ఉన్నవారికి జీవక్రియ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. దీని వల్ల బరువు పెరగడం, గుండె సమస్యలు రావడం వంటివి ఉంటాయట. అయితే, ఈ పండ్లు తింటే ఆ సమస్య చాలా వరకూ దూరమవుతుందని చెబుతున్నారు. హై ఫైబర్, లో కేలరీస్ కలిగిన అంజీర్ పండ్లు మీ కడుపు నిండినట్లుగా అనిపించేలా చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండినట్లుగానే ఉంటుంది. దీంతో బరువు కూడా తగ్గుతారట. బరువు తగ్గాలనుకునేవారు రోజూ తినవచ్చని, అయితే, రోజుకి 2, 3 పండ్ల కంటే ఎక్కువగా తినకూడదని చెబుతున్నారు.

Exit mobile version