Site icon HashtagU Telugu

Dinner: రాత్రిళ్ళు 7 గంటల కంటే ముందే డిన్నర్ చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Earley Dinner

Earley Dinner

Dinner: రాత్రి సమయంలో డిన్నర్ విషయంలో చాలామంది తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. వాటి వల్ల లేని పోనీ సమస్యలు వస్తుంటాయి. కొందరు తొందరగా తిని తొందరగా పడుకుంటే ఇంకొందరు ఆలస్యంగా తినడమే కాకుండా ఆలస్యంగా నిద్రపోతుంటారు. అయితే ఇలాంటి జీవనశైలి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కాగా డిన్నర్ రాత్రి 7 నుంచి 8 గంటల మధ్యలో చేయడం మంచిదని చెబుతున్నారు. మరి రాత్రి సమయంలో తొందరగా భోజనం చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తొందరగా డిన్నర్ చేయడం చాలా మంచిది. దీని వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగ్గా మారడమే కాకుండా చాలా సమస్యల్ని దూరం అవుతాయట. ముఖ్యంగా రాత్రి 7 దాటాక కొంతమంది ఫుడ్ తీసుకుంటారు.

‎‎9 గంటలకి అలా తీసుకుంటే స్ట్రోక్, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఎప్పుడైతే డిన్నర్ 7 తర్వాత తింటామో అప్పుడు 28 శాతం గుండె సమస్యల నుంచి తప్పించుకోవచ్చట. తరచుగా డిన్నర్‌ని త్వరగా తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని, నిద్ర సమస్యలు కూడా దూరమవుతాయని చెబుతున్నారు. అంతేకాకుండా బరువుని కూడా ఈజీగా మేనేజ్ చేయవచ్చట. త్వరగా డిన్నర్ చేయడం వల్ల జీర్ణ సమస్యలు రావని చెబుతున్నారు. సూర్యా స్తమయం సాధారణంగా అగ్ని తగ్గుతుంది. కాబట్టి ఈ లోపే తింటే త్వరగా జీర్ణమవుతుందట. దీంతో బ్లోటింగ్, గ్యాస్ వంటి సమస్యలు రావని, ఎవరైతే మలబద్ధకంతో బాధపడుతున్నారో వారు కచ్చితంగా 7 గంటలకి తినడం అలవాటు చేసుకుంటే త్వరలోనే ఆ సమస్యకి చెక్ పెట్టవచ్చు అని చెబుతున్నారు.

‎‎జీర్ణ సమస్యలు తగ్గి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుందని త్వరగా తినడం అలవాటు చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. పడుకోవడానికి ముందు కనీసం 3 నుంచి 4 గంటల ముందుగా డిన్నర్‌ ని కంప్లీట్ చేస్తే నిద్ర సమస్యలు దూరమై సరిగా నిద్రపడుతుందట. అలాగే తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణమవుతుందట. దీంతో గ్యాస్ పట్టేయడం, అసిడిటీ వంటివి ఉండవట. కడుపు తేలిగ్గా మారి మంచి నిద్ర మీ సొంతమవుతుందని చెబుతున్నారు. కాగా నిద్ర సమస్యలతో బాధపడుతున్న వారు రాత్రి భోజనం తొందరగా తినడం మంచిది. త్వరగా డిన్నర్ చేయడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి అధిక బరువు కూడా తగ్గుతారట. దీని కారణంగా ఆటోమేటిగ్గా హైపర్ టెన్షన్, షుగర్ వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయని చెబుతున్నారు.

‎ఎవరైతే ముందు నుంచీ ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటారో వారు త్వరగా డిన్నర్‌ ని కంప్లీట్ చేయడం మంచిదని చెబుతున్నారు. ఎవరైతే ముందుగా డిన్నర్ చేస్తారో వారి బాడీ రిలాక్స్‌ గా లైట్‌ గా ఫీల్ అవుతుందని దీంతో ఒత్తిడి తగ్గి మానసిక సమస్యలు కూడా దూరమవుతాయని చెబుతున్నారు. రెగ్యులర్‌గా రాత్రుళ్లు లేట్‌ గా తినేవారికి ఉదయాన్నే బద్ధకంగా అనిపించడం జరుగుతూనే ఉంటుందట. దీనికి కారణం ఆలస్యంగా తీసుకున్న ఆహారం లేట్‌ గా జీర్ణమవ్వడం దీంతో సరిగ్గా మలవిసర్జన చేయకపోవడం వీటన్నిటి కారణంగా బాడీ మొత్తం అలసటగా ఉంటుందట.అలా కాకుండా త్వరగా డిన్నర్ చేస్తే తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమై ఉదయాన్నే మలవిసర్జన సజావుగా జరుగుతుందట.

Exit mobile version