Dal Rice: రాత్రిపూట అన్నం పప్పు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

చాలామంది ఆహారంలో మీకు ఏది ఇష్టం అంటే చాలు అన్నం పప్పు చారు అనే టక్కున చెప్పేస్తూ ఉంటారు. ఈ అన్నం

  • Written By:
  • Publish Date - November 10, 2022 / 07:30 AM IST

చాలామంది ఆహారంలో మీకు ఏది ఇష్టం అంటే చాలు అన్నం పప్పు చారు అనే టక్కున చెప్పేస్తూ ఉంటారు. ఈ అన్నం పప్పు తినడానికి రుచిగా ఉండడం మాత్రమే కాకుండా శరీరానికి కావలసిన ఎన్నో రకాల పోషకాలను కూడా అందుతాయి. పప్పు అన్నం లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ, ఫైబర్, విటమిన్ బి1 , యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కంది పప్పును తినడం వల్ల మీ శరీరానికి విటమిన్ సి, విటమిన్ డి, విటమినె కె లు అందుతాయి. మరి రాత్రిపూట అన్నం పప్పు తినడం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రాత్రిపూట అన్నం పప్పు కలిపి తినడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. ఇలా తేలిక బయట ఆహారం తినడం వల్ల మానసిక స్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. అలాగే ఫిట్ నెస్ ను ఇష్టపడేవారు రాత్రి పూట పప్పు అన్నం తినడం మంచిది. పొట్టకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు కూడా రాత్రిపూట అన్నం పప్పు తినడం మంచిది. పొట్ట సమస్యలు ఉన్నవారు అన్నం పప్పు తినడం వల్ల జీర్ణ సమస్యలు మెరుగుపడతాయి. కడుపులో మంటగా ఉన్నప్పుడు పప్పు అన్నం తినడం వల్ల ఉపశమనం లభిస్తుంది. పప్పు, బియ్యం లో ప్రోటీన్ తో పాటుగా ఫైబర్ అలాగే ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి.

పప్పు అన్నం తినడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. కేలరీలు కూడా కేలరీలు బర్న్ అవుతాయి. పప్పు అన్నంలో కాల్షియం, ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఎముకలను, కండరాలను బలంగా చేస్తాయి. దీనిలోని కాల్షియం దంతాలను బలోపేతం చేస్తుంది. అన్నం తింటున్నప్పుడు అన్నం కంటే పప్పు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే ఈ ప్రయోజనాలను పొందవచ్చు.