Site icon HashtagU Telugu

Dal-Rice: రోజు పప్పు, అన్నమే అని అనుకుంటున్నారా.. దీని వల్ల కలిగే లాభాలు తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!

Dal Rice

Dal Rice

మామూలుగా ఇప్పుడు ఒకే విధమైన వంటలు కాకుండా కొత్త కొత్తగా వంటలు చేసుకుని తినాలని అనుకుంటూ ఉంటారు. ఒకే వంట ప్రతి రోజు తిన్నా కూడా బోర్ కొడుతూ ఉంటుంది. ఇకపోతే చాలామందికి పప్పు అన్నం కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. పప్పు అన్నం లోకి కాస్త వేపుడు లేదంటే పచ్చళ్ళు వేసుకొని తింటూ ఉంటారు. అయితే ప్రతిరోజు పప్పు, అన్నం తినాలి అన్నా కూడా చాలామంది బోరింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. రోజు తినే పప్పన్నమే కదా అని చులకనగా చూస్తూ తీసిపారేస్తూ ఉంటారు. కానీ కొందరు పప్పులో రకరకాల పప్పులు తయారు చేస్తూ ఉంటారు. ఆకు కూర పప్పు, మెంతి పప్పు, శనగబేళ్ల పప్పు, కందిబ్యాల్ల పప్పు అంటూ రకరకాల పప్పులు చేసుకొని తింటూ ఉంటారు. అయితే ఈ పప్పు అన్నం కాంబినేషన్ ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని చెబుతున్నారు. మరి పప్పు అన్నం తింటే ఏం జరుగుతుందో, ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రాత్రి సమయంలో అన్నం పప్పు తినడం వల్ల తొందరగా జీర్ణం అవుతుందట. అందులో ఉండే పోషకాలు కూడా అందుతాయని చెబుతున్నారు. త్వరగా జీలమయ్యాయి ఆహారం తినడం వల్ల జీర్ణ సమస్యలు వంటివి ఉండవట. రాత్రిల్లు అన్నం పప్పు తినడం వల్ల హాయిగా నిద్ర పడుతుందట. పప్పు అన్నం తిన్న తర్వాత నిద్ర కోసం కష్టపడాల్సిన పనిలేదని చాలా త్వరగా నిద్రలోకి జారుకునేలా చేస్తుందని చెబుతున్నారు. మరుసటి రోజు ఉదయం కూడా చాలా ఎనర్జిటిక్ గా ఫ్రెష్ గా ఉంటారని చెబుతున్నారు. కాగా అన్నం, పప్పు తినడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుందట. దీనివల్ల మీరు అతిగా తినలేరట. వీటివల్ల మీరు బరువు పెరిగే అవకాశం అసలే ఉండదని చెబుతున్నారు. అలాగే బరువు కూడా సులువుగా తగ్గుతారట. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఫుడ్ అని చెబుతున్నారు.

అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఈ తేలికపాటి భోజనం చేయడం వల్ల మీ జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందట.. పప్పు అన్నాన్ని తినడం వల్ల కడుపుకు సంబంధించిన సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. అలాగే పప్పు అన్నాన్ని కలిపి తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయట. ఎముకల సమస్యలు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. కాగా ఈ తేలికపాటి భోజనంలో ప్రోటీన్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయట. ఇవి దంతాలను, ఎముకలను బలోపేతం చేస్తాయని, అలాగే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయని చెబుతున్నారు. కాగా అన్నం, పప్పును కలుపుకుని తింటే కండరాలు బలోపేతం అవుతాయని చెబుతున్నారు. అంతేకాదు పప్పు అన్నం తింటే దంతాలు కూడా స్ట్రాంగ్ గా ఉంటాయట. దంతాల సమస్యలు వచ్చే రిస్క్ కూడా తగ్గుతుందట. పప్పు అన్నం తినడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య నుంచి కూడా ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.