పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. తరచూ పెరుగును తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పలు రకాల సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చట. పెరుగును సీజన్ తో సంబంధం లేకుండా అన్ని సీజన్ లలో తినవచ్చని చెబుతున్నారు. పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పెరుగు గొప్ప ప్రోబయోటిక్ ఆహారం. దీనిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కాగా పెరుగులో తేనె కలుపుకొని తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పెరుగులో మాదిరిగా తేనెలో కూడా ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. తేనెలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, వివిధ రకాల ఎంజైమ్ లు ఉంటాయి. తేనె మంచి ఎనర్జీ బూస్టర్. ఇలాంటి తేనెను పెరుగులో కలిపి తీసుకుంటే మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయట. పెరుగు మన పొట్ట ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. అందుకే ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల మీ పేగులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. పెరుగులో తేనెను కలుపుని తింటే మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
తేనెలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పెరుగు, తేనె కూడా జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయట. ఇవి శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడానికి కూడా సహాయపడతాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.