వేసవికాలం వచ్చింది అంటే చాలు అందంతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. అందుకే ఈ సీజన్లో వచ్చే సమస్యల నుంచి బయట పడాలి అంటే సీజనల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తప్పనిసరిగా తినాల్సిందే అని చెబుతున్నారు. అయితే వేసవికాలంలో ఎక్కువగా లభించే వాటిలో కీరదోసకాయ కూడా ఒకటి. దీనిని కొంతమంది ఫ్రూట్ గా భావిస్తే మరి కొందరు వెజిటేబుల్ గా భావిస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యంతో పాటు అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. చల్లదనాన్ని కలిగించడంలో ఈ కూరగాయ ఎంతో దోహదపడుతుంది. రోజు కీర దోసకాయను తినడం వల్ల శరీరానికి అనేక విధాలుగా మేలు జరుగుతుందట.
కీర దోసకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, పీచు పదార్థాలు సహా శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి. వేసవిలో ఎక్కువ వేడి కారణంగా శరీరంలోని నీటి లోపం ఏర్పడే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ప్రతిరోజూ కొంతమేర దోసకాయను తీసుకుంటే శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుందట. ఎందుకంటే కీరా దోసకాయలో మిగతా పదార్థాల కంటే నీరు అధికంగా ఉంటుందట. ఇది దాహాన్ని తగ్గిస్తుందని, ఒత్తిడిని నివారిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు వేసవి వేడిని తట్టుకునే శక్తిని కూడా పెంచుతుందట. దోసకాయ తినడం వల్ల చర్మానికి కూడా మంచి లాభాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఈ కూరగాయలో ఉండే విటమిన్లు చర్మాన్ని శుభ్రంగా, తేమతో మెరిసేలా ఉంచుతాయట. మొటిమలు, దురద, పొడి చర్మం వంటి సమస్యలు నివారించడానికి సహాయపడతాయని, దీనిలోని విటమిన్ ఎ, సి చర్మ కణాల పునరుత్పత్తికి తోడ్పడతాయని చెబుతున్నారు. దోసకాయలోని పోషకాలు కేవలం చర్మానికే కాదు, కళ్ళకు, జుట్టు ఆరోగ్యానికీ చాలా ఉపయోగపడతాయట. కంటి చూపు మెరుగుపడేందుకు ఇది సహాయపడుతుందట. జుట్టు ఒత్తుగా, బలంగా పెరిగేందుకు అవసరమైన పోషకాలను అందిస్తుందట.
జుట్టు రాలిపోవడం వంటి సమస్యలకు ఇది సహకరిస్తుందని చెబుతున్నారు. దోసకాయ తినడం ద్వారా జీర్ణవ్యవస్థ మెరుగవుతుందట. దీనిలో ఉండే పీచు పదార్థం పేగుల్లో ఆహారాన్ని సులభంగా కదిల్చేందుకు సహాయపడుతుందట. దీని వల్ల మలబద్ధకం వంటి సమస్యలు నివారించబడతాయట. జీర్ణక్రియ వేగంగా జరిగేలా చేస్తుందట. ఇది పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుందట. అలాగే దోసకాయలో ఉండే తేమ శాతం చర్మానికి తగినంత తేమను అందించడంలో సహాయపడుతుందట. వేసవిలో అధిక వేడి వల్ల చర్మం పొడిబారే అవకాశం ఉంటుందట. అలాంటి పరిస్థితుల్లో దోసకాయ తినడం వల్ల చర్మం మృదువుగా, ఆరోగ్యంగా ఉంటుందట. కాబట్టి దోసకాయను మితంగా ప్రతిరోజూ తీసుకుంటే శరీరానికి అనేక ఉపయోగాలు కలుగుతాయని చెబుతున్నారు.