Cucumber: వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకునే అనేక మార్గాలను ఆశ్రయిస్తుంటారు. అయితే వేసవిలో కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారాల్లో కీరదోస కూడా ఒకటి. కీరదోసలో అనేక పోషకాలు ఉంటాయి. కీరదోసలో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది బీపీ ఉన్నవారికి మేలు చేస్తుంది. వేసవిలో మనకు చెమట అధికంగా పడుతుంది. కానీ కీరదోసను తింటే శరీరం కోల్పోయిన ద్రవాలను తిరిగి పొందవచ్చు. అలాగే శరీరం కోల్పోయిన మినరల్స్ కూడా మనకు కీరదోస ద్వారా తిరిగి లభిస్తాయి.
కీరదోసను తింటే కలిగే ఉపయోగాలు..
♦ రోజుకు ఒక కీరదోసను తింటే కేవలం 13 క్యాలరీల శక్తి మాత్రమే లభిస్తుంది. ప్రోటీన్లు 0.4 గ్రాములు, పిండి పదార్థాలు 2.5 గ్రాములు, కొవ్వులు 0.1 గ్రాములు, ఫైబర్ 2.6 గ్రాములు, సోడియం 10.2 మిల్లీగ్రాములు, పొటాషియం 50 మిల్లీగ్రాములు లభిస్తాయి.
♦ రోజూ ఒక కప్పు కీరదోస రసం సేవిస్తుంటే చర్మం నిగారింపును పొందుతుంది.
♦ కీరదోసలో ఫోలేట్, విటమిన్ ఎ, సి అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. దీంతో చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు తగ్గుతాయి. వృద్ధాప్య ఛాయలు మాయమవుతాయి. యవ్వనంగా కనిపిస్తారు.
♦ హైబీపీ ఉన్నవారికి కీరదోస ఎంతో మేలు చేస్తుంది. కీరదోసలో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. ఫలితంగా బీపీ తగ్గుతుంది.
♦ జుట్టు, గోర్లు చిట్లిపోయే సమస్య ఉన్నవారు రోజూ ఒక కీరదోసను తింటుంటే ఫలితం ఉంటుంది.
♦ కీరదోసను రోజూ తింటున్నా లేదా కీరదోసను అడ్డంగా చక్రాల్లా కట్ చేసి కళ్లపై 20 నిమిషాల పాటు పెట్టుకుంటున్నా కూడా కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలు తగ్గిపోతాయి.
♦ కీరదోసను పేస్ట్‌లా చేసి జుట్టుకు అప్లై చేసి కాసేపు అయ్యాక తలస్నానం చేయాలి. దీంతో శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి.
♦ రోజు కీరదోస తినడం వల్ల జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.
♦ కీరదోసను తొక్కతోసహా తింటేనే మనకు విటమిన్ కె లభిస్తుంది. దీని ద్వారా గాయాలైనప్పుడు రక్త స్రావం అధికంగా అవకుండా రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది.
♦ భోజనానికి ముందు కీరదోసను తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారం తక్కువగా తింటారు. తద్వారా బరువు తగ్గడం సులభతరం అవుతుంది.