Coconut : రోజూ కొబ్బరి ముక్క తినడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

రోజూ కొబ్బరి ముక్క తినడం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - September 29, 2023 / 09:37 PM IST

మనం పూజలకు కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరి(Coconut) తింటాం. లేదా అప్పుడప్పుడు కొబ్బరి నీళ్లు(Coconut Water) తాగినప్పుడు తింటాం. ఇక కొబ్బరితో కొబ్బరి పచ్చడి, పులుసు, స్వీట్స్.. ఇలా చాలా చేసుకొని తినొచ్చు. కూరల్లో కూడా కొబ్బరి పొడి వేసుకొని తింటాము. అయితే రోజూ కొబ్బరి ముక్క తినడం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

కొబ్బరిలో రాగి, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, జింక్, ఫోలేట్, థయామిన్, విటమిన్ సి ఇంకా చాలా రకాల పోషకాలు, విటమిన్లు ఉన్నాయి. వీటివలన కొబ్బరి రోజూ తినడం వలన మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

* కొబ్బరిలో ఉండే యాంటి బ్యాక్టీరియల్, ఫంగల్ లక్షణాలు, విటమిన్ సి మన శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచి శరీరాన్ని పటిష్టంగా తయారుచేస్తుంది.
* కొబ్బరిలో ఉండే సంతృప్త కొవ్వులు మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచి గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా చేస్తుంది.
* కొబ్బరిని రోజూ తింటే అది మన శరీరం కాల్షియం, మెగ్నీషియం శోషించుకోవడంలో సహాయపడుతుంది. కాబట్టి మన శరీరంలో ఎముకలు, దంతాలు బలంగా తయారవుతాయి.
* కొబ్బరిలో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి. కొబ్బరిని రోజూ తినడం వలన అది మనకు క్యాన్సర్ రాకుండా ఉండడానికి సహాయపడుతుంది.
* కొబ్బరిని రోజూ తినడం వలన అది మన శరీరంలో రక్తంలో చక్కర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతుంది.
* కొబ్బరిని రోజూ తినడం వలన కొబ్బరిలో ఉండే ఫైబర్ మలబద్దకం వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.
* కొబ్బరిని రోజూ తింటే అది మనకు జంక్ ఫుడ్ తినకుండా చేస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది ఈ విధంగా మనం బరువు తగ్గవచ్చు. బరువు తగ్గాలి అని అనుకునేవారు రోజూ కొబ్బరి ముక్కలు తినవచ్చు.
* కొబ్బరి ముక్కల్లో ఉండే ఐరన్ రక్త హీనతను తగ్గిస్తుంది.

అయితే రోజు కొంచెం చిన్న ముక్క తింటే చాలు. బాగుంది కదా అని ఎక్కువ తింటే కొబ్బరి తినడం వలన దగ్గు సమస్య, గొంతుకి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి.

 

Also Read : Unwanted Hair : అమ్మాయిల్లో అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి చిట్కాలు..