సాధారణంగా మార్కెట్ లో మనకు రెండు రకాల ద్రాక్షలు లభిస్తూ ఉంటాయి. అందులో ఒకటి గ్రీన్ కలర్ లో ఉండే ద్రాక్ష మరొకటి నల్ల ద్రాక్ష. అయితే ద్రాక్షను తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా నల్ల ద్రాక్షలో అనేక రకాల విటమిన్లు ఉన్నాయి. నల్ల ద్రాక్షలో మెగ్నీషియం, ఫాస్ఫరస్,సెలీనియం, క్యాల్షియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. నల్ల ద్రాక్ష రోగనిరోధక శక్తిని పెంచి అనేక రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అయితే నల్ల ద్రాక్ష కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా జుట్టుకి చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది.
అలాగే అధిక బరువు సమస్యతో బాధపడే వారు కూడా నల్ల ద్రాక్షను వారి ఆహారంలో చేర్చుకోవడం మంచిది. కాగా నల్ల ద్రాక్షలో ఉండే ఫైటో కెమికల్స్ గుండెలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్స్ ను తగ్గించి గుండె సమస్యలను తగ్గించడంతోపాటు గుండె ఆరోగ్యంగా ఉండడానికి బాగా ఉపయోగపడతాయి. నల్ల ద్రాక్ష వల్ల అధిక రక్తపోటు అలాగే కిడ్నీ సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారు నల్ల ద్రాక్ష రసం తీసుకోవడం వల్ల ఆ సమస్యలకు చెప్పి పెట్టవచ్చు.
నల్ల ద్రాక్షను తినడం వల్ల మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఒత్తిడి ఆందోళన సమస్యలతో బాధపడేవారు నల్ల ద్రాక్షను తీసుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. నల్ల ద్రాక్ష చర్మ సౌందర్యానికి మంచి ఫలితాలను అందిస్తుంది. నల్ల ద్రాక్ష చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా తాజాగా ఉంచడానికి బాగా సహాయపడతాయి. కాబట్టి చర్మ సౌందర్యం కోసం నల్ల ద్రాక్షతో ఫేషియల్ ను ప్రయత్నిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.