మన వంటింట్లో దొరికే దివ్య ఔషధాలతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. కాగా మన కిచెన్ లో ఉండే దివ్యౌషధాలలో శొంఠి కూడా ఒకటి. శొంఠి పలు అనారోగ్యాలను నయం చేస్తుంది. శొంఠి అనగానే మనకు గుర్తుకు వచ్చేది శొంఠి పాలు. ఈ శొంఠి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను శొంఠి దూరం చేస్తుంది. మరి శొంఠి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శొంఠిలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జలుబును వెంటనే పోగొడుతాయి. శీతాకాలంలో చాలా మందికి గొంతు సమస్యలను ఎదుర్కొంటు ఉంటారు. అటువంటి వారు శొంఠి పొడిని పాలల్లో కలిపి రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
శొంఠి గ్యాస్, ఆహారం జీర్ణం కాకపోవడం, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం లాంటి ఉదర సంబందిత సమస్యలకు ఒక మంచి ఔషధంలా పనిచేస్తుందని చెప్పవచ్చు. అయితే ఈ సమస్యలను పోగొట్టుకోవాలంటే రాత్రి పడుకునే ముందు శొంఠి పొడి కలిపిన పాలు తాగితే చాలు ఈ సమస్యలు అన్ని మాయం అవుతాయి. అలాగే రోగనిరోధక శక్తి తక్కువుగా ఉన్న వారికీ జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు తరచు వేధిస్తూ ఉంటాయి. అలాంటి వారికీ కూడా శొంఠి పాలు ఉపశమనం ఇస్తాయి. అలాగే కీళ్లలో సమస్యలు పెరిగినప్పుడు కూడా ఈ పాలు తాగాలి. శొంఠి పొడిలో ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందుకే రక్త హీనత కూడా తగ్గించి రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి. చలికాలంలో, ఎముకల కీళ్లలో సమస్యలు మొదలవుతాయి.
కీళ్ల సమస్యలు పెరిగినప్పుడు అల్లం పొడిని పాలలో కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది. అల్లం పొడిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది, ఇది ఎముక నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి చలికాలంలో జలుబు, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తుంటాయి. అలాంటప్పుడు రాత్రి పడుకునే ముందు శొంఠిని పాలలో కలిపి తాగడం వల్ల వ్యాధి నిరోధక శక్తి మెరుగుతుంది. సీజన్‌లో వచ్చే వ్యాధులు దూరమవుతాయి.