Site icon HashtagU Telugu

Drinking Water : పరగడుపున నీళ్లు ఎందుకు తాగాలి.. అలా నీళ్లు తాగితే ఏం జరుగుతుంది?

Mixcollage 24 Jan 2024 02 43 Pm 1921

Mixcollage 24 Jan 2024 02 43 Pm 1921

మనం ఉదయం లేవగానే చాలా రకాల పనులు చేస్తూ ఉంటాం. అటువంటి వాటిలో ఉదయం లేవగానే నీరు తాగడం కూడా ఒకటి. కొందరం గోరువెచ్చని నీరు తాగితే మరికొందరు నార్మల్ వాటర్ తాగుతూ ఉంటారు. వైద్యులు కూడా ఉదయం లేవగానే నీరు తాగడం అలవాటు చేసుకోవాలని చెబుతూ ఉంటారు. మరి పరగడుపున నీళ్లను ఎందుకు తాగాలి? ఒకవేళ నీళ్లు తాగితే ఏం జరుగుతుంది? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఖాళీ కడుపుతో పరగడుపున మంచినీళ్లు తాగితే మీ శరీరంలోని విష పదార్థాలన్నీ బయటికి పోతాయి. . ఎందుకంటే ఉదయం లేవగానే కడుపు ఖాళీగా ఉంటుంది.

ఒక గ్లాస్ కానీ రెండు గ్లాసుల మంచి నీళ్లు తాగగానే మంచి నీళ్లు లోపల ఉన్న చెత్తా చెదారాన్ని అంతా బయటికి పంపిస్తుంది. విష పదార్థాలన్నీ మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతాయి. అలాగే పేగుల్లో గడ్డ కట్టుకుపోయిన మలం మొత్తం మంచి నీళ్లు తాగగానే, విరేచనం సాఫీగా అయి మలబద్ధకం సమస్య తగ్గుతుంది. నిత్యం లేవగానే కాసిన్ని మంచినీళ్లు తాగే అలవాటు ఉన్నవాళ్లకు మలబద్ధకం సమస్య అస్సలు రాదు. అయితే ఉదయం లేవగానే ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? అనే ప్రశ్నలు అందరికీ వస్తాయి. ఇక్కడ కొలత అంటూ ఏమీ ఉండదు. తమకు తోచినన్ని మంచినీళ్లను తాగవచ్చు. అలాగే ఉదయం పూట నీళ్లు తాగితే.. పేగు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

గ్యాస్ ట్రబుల్ ఉండదు. ఉదర సంబంధ వ్యాధులన్నీ తగ్గిపోతాయి. ఉదయం మంచినీళ్లు తాగే వాళ్లు కాస్త గోరు వెచ్చని నీటిని తాగడం మంచిది గోరు వెచ్చని నీటిని తాగితే బరువు తగ్గుతారు. పేగులు, ఇతర అవయవాలన్నీ శుభ్రం అవుతాయి. మూత్రపిండాలు, కాలేయం శుభ్రం అయి వాటి పనితీరు మెరుగుపడుతుంది. చాలామంది అప్పుడప్పుడు డీహైడ్రేట్ అవుతుంటారు. అలాంటి వాళ్లు రోజూ ఉదయాన్నే మంచినీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే డీహైడ్రేషన్ సమస్యే రాదు. మరి బ్రష్ చేసుకోక ముందు తాగాల లేక బ్రష్ చేసుకున్న తర్వాత తాగాలా అన్న విషయానికి వస్తే బ్రష్ చేసుకోక ముందు తాగితేనే మంచిది అంటున్నారు నిపుణులు.