మామూలుగా వేసవి కాలం వచ్చింది అంటే చాలు చాలా మంది ఫ్రిడ్జ్ లో నీరు ఎక్కువగా తాగుతూ ఉంటారు. కొంతమంది గడ్డలు కట్టిన నీటిని కూడా తాగేస్తూ ఉంటారు. అయితే ఫ్రిడ్జ్ లో నీరు తాగడం వల్ల అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మరి వేసవికాలంలో బయట నీరు వేడిగా ఉంటాయి కదా మరి ఎలా అని అనుకుంటున్నారా, అలాంటివారు కుండలోని నీరు తాగడం వల్ల చల్లనీరు తాగిన అనుభూతి పెరగడంతో పాటుగా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. మరి ఫ్రిడ్జ్ నీటికి బదులుగా కుండలోని నీరు తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ మధ్యకాలంలో ఆరోగ్యం విషయంపై అవగాహన పెరిగిపోవడంతో చాలామంది కుండలోని నీరు తాగడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఈ కుండలో ఫ్రిడ్జ్ లో అంత చల్లగా ఉండకపోవచ్చు కానీ నీరు మాత్రం కాస్త రుచిగానే ఉంటాయని చెప్పాలి. నీడని ప్రాంతంలో చుట్టూ కానుగ ఆకు లేదంటే ఒక చల్లటి బట్ట చుట్టి పెడితే చాలా చల్లగా ఉంటాయి. ఈ నీటిని తాగడం వల్ల జీవక్రియ జీర్ణ క్రియ పుష్కలంగా పెరుగుతుందట. మట్టిలో ఖనిజాలు నీటిలో పోషకాలను నింపుతాయట. ఇవి జీర్ణక్రియకి సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే ఆహారం నుండి పోషకాలను గ్రహించేందుకు హెల్ప్ చేస్తాయట. మట్టికుండని వాడితే సహజంగానే నీరు చల్లగా మారుతుందట.
మట్టి కుండలు రంధ్రాల స్వభావాన్ని కలిగి ఉంటాయట. ఇది నీరు నెమ్మదిగా గోడల గుండా వెళ్లి ఉపరితలంపై ఆవిరైపోయేలా చేస్తుందట. బాష్పీభవన శీతలీకరణ అని పిలిచే ఈ ప్రక్రియ కుండ లోపల నీటిని ఆహ్లాదకరమైన చల్లని ఉష్ణోగ్రత వద్ద ఉంచుతుందట. ముఖ్యంగా ఎండాకాలంలో ఎక్కువగా చల్లగా ఉండి గొంతులో అసౌకర్యాన్ని కలిగించే ఫ్రిజ్ నీటిలా కాకుండా మట్టి కుండలోని నీరు సహజంగానే పరిపూర్ణమైన, రీఫ్రెషింగ్ టెంపరేచర్ కి చల్లబడుతుందట. కాగా మట్టి కుండలో నీటిని నిల్వ చేసినప్పుడు అది మట్టిలోని ఖనిజాలతో సంకర్షణ చెందుతుందట. ఈ పరస్పర చర్య నీటి pH లెవల్స్ ని బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తాయట. బంకమట్టి క్షార స్వభావం నీటిలోని ఆమ్లతని తటస్థీకరిస్తుందట.
ఇది శరీరానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. మట్టి కుండలోని నీరి రుతాగితే జీవక్రియ, జీర్ణక్రియ గణనీయంగా పెరుగుతుందట. బంకమట్టి లోని ఖనిజాలు జీర్ణక్రియకి సహాయపడే పోషకాలతో నీటిలో నింపుతాయట. ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో హెల్ప్ చేస్తాయట. ఇది మెరుగైన జీవక్రియ, మెరుగైన పేగు ఆరోగ్యానికి దారి తీస్తుందని చెబుతున్నారు. మట్టికుండలోని నీరు మంచి రుచిని కలిగి ఉంటుందట. చాలా మంది ప్లాస్టిక్, ఇతర మెటల్ లో ఉంచిన నీటిని ఇష్టపడతారు. కానీ మట్టి కుండలో జరిగే సహజ వడపోత కారణంగా మలినాలు తొలగిపోతాయట. నీటికి తేలికపాటి మట్టి రుచి వస్తుందని, ఇది తాగే నీటిని మరింత రుచిగా చేసి హైడ్రేటెడ్ గా ఉంచుతాయని చెబుతున్నారు..