టమోటా వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. టమాటాల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి 6, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, రాగి, ఫైబర్, లైకోపీన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. పోషకాల బాంఢాగారమైన టమాటా జ్యూస్ ను ఉదయం పరిగడుపున తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చట. టమోటాలలో విటమిన్ సి తో పాటుగా ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయని చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం పరగడుపున టమాటా జ్యూస్ ను తాగడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుందట.
దీంతో అంటు వ్యాధులు, ఇతర రోగాల ముప్పు కూడా తగ్గుతుందని చెబుతున్నారు. అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక రోగాలకు కారణమవుతుంది. అయితే పొటాషియం ఎక్కువగా ఉండే టమోటా జ్యూస్ ను తాగడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందట. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు. ఉదయాన్నే పరగడుపున టమాటా జ్యూస్ ను తాగితే మన జీర్ణక్రియ మెరుగుపడుతుందట. టమాటా రసంలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని ఉదయం పరగడుపున తాగితే మలబద్దకం సమస్య తగ్గిపోతుందని చెబుతున్నారు.
టమాటాల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రల్ ను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే టమాటా జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కూడా గుండె ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే డయాబెటిస్ కూడా నియంత్రణలో ఉంటుందట. టమోటా ను ఉపయోగించడం వల్ల చర్మ ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుందని చెబుతున్నారు. టమోటాను నేరుగా చర్మంపై ఉపయోగించడం వల్ల మాత్రమే కాకుండా తీసుకోవడం వల్ల కూడా చర్మం ఆరోగ్యంగా ఉంటుందట.