కుంకుమ పువ్వు.. దీనివల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ కుంకుమపువ్వు ధర వేళల్లో లక్షల్లో ఉంటుంది అని చెప్పవచ్చు. వీటి ధర కారణంగా చాలామంది కొనడానికి వెనుకడుగు వేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం ఈ కుంకుమపువ్వును గర్భిణీ స్త్రీలు ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే కొన్ని రకాల స్వీట్లు తయారీలో కూడా ఈ కుంకుమపువ్వును ఉపయోగిస్తూ ఉంటారు. ఈ కుంకుమపువ్వు వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా వీటిని పాలల్లో వేసుకొని తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చట.
ఇంతకీ ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది వంటల తయారీలో కూడా కుంకుమపువ్వును ఉపయోగిస్తూ ఉంటారు. కుంకుమపువ్వు డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుంది. కుంకుమ పువ్వులో క్రోసిన్, సఫ్రానాల్, పిక్రోక్రోసిన్ తో పాటుగా బయోయాక్టివ్ సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఈ సమ్మేళనాలు నిరాశ, నిస్పృహ లక్షణాలను నియంత్రించడానికి ఎంతో సహాయపడుతుందని చెబుతున్నారు. కుంకుమ పువ్వు యాంటీ డిప్రెసెంట్ ప్రభావాన్ని కలిగి ఉందని తేల్చింది. ఆందోళన, నిద్రలేమి, నిస్పృహ లక్షణాలను తగ్గిస్తుందట. కుంకుమపువ్వులో ఎన్నో రకాల మొక్కల సమ్మేళనాలు ఉంటాయి.
ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. కుంకుమ పువ్వులో ఉండే సఫ్రానల్ అనే సమ్మేళనం మానసిక స్థితిని, జ్ఞాపకశక్తిని, అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందట. అలాగే మెదడు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడుతుందని చెబుతున్నారు. కుంకుమ పువ్వు తలనొప్పి, నొప్పి, ఆందోళన వంటి పీఎంఎస్ లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. పాలలో కుంకుమపువ్వును కలిపి తాగడం వల్ల మీ మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.