Site icon HashtagU Telugu

Pudina Benefits: పుదీనా నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. ఆ సమస్యలన్నీ దూరం!

Mint Leaves

Mint Leaves

మన ఇంట్లో ఉండే ఆకుకూరల్లో పుదీనాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పుదీనాలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ పుదీనా ఆకులను వివిధ రకాల వంటలకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా మసాలా వంటలకు దీని వాడకం ఎక్కువ. వంటల్లో పుదీనాను వాడటం కేవలం రుచి, వాసనకు మాత్రమే కాదు. ఇందులో అనేక ఔషధ గుణాలు దాగున్నాయి.అందుకు పురాతన కాలం నుండే పుదీనాను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పుదీనాతో అజీర్ణానికి కూడా చెక్ పెట్టవచ్చు. పుదీనాలోని పోషక గుణాలు కడుపుకు సంబంధించిన చాలా సమస్యలను దూరం చేస్తాయి.

కడుపు నొప్పి లేదా గ్యాస్, మలబద్ధకం సమస్యలు కు పుదీనా ఒక చక్కటి పరిష్కారం అని చెప్పవచ్చు. అజీర్ణం కడుపునొప్పి కి పుదీనా ఒక అద్భుత ఔషధంగా కూడా పనిచేస్తుంది. అంతేకాకుండా పుదీనా ఆకులు అజీర్తి సమస్య దూరం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కడుపునొప్పిని కూడా దూరం చేస్తుంది. మరి అజీర్ణం సమస్యను దూరం చేసుకునేందుకు పుదీనా ఆకులను ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నీళ్లు ఉడికించుకొని అందులో పుదీనా ఆకులు వేయాలి. పది నిమిషాల తరువాత వడపోసి కొద్దిగా నిమ్మకాయ పిండుకుని తాగాలి.

ఇక రెండవ పద్ధతి ఆరు ఏడు పుదినా ఆకుల్ని బాగా కడిగి క్రష్ చేసి తర్వాత బౌల్లో వేసి అందులో కొన్ని గోరువెచ్చని నీళ్లు కలపాలి. అలా కలిపిన మిశ్రమాన్ని తాగడం వల్ల అజీర్తి సమస్య పోతుంది. ఇక మూడవ విధానం పుదీనా ఆకుల్ని బాగా కడిగి పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ ని ప్రతిరోజు కొద్దిగా గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగుతూ ఉండాలి. అలా చేయడం వల్ల అజీర్తి సమస్య తగ్గి ఉపశమనం కలుగుతుంది. అయితే పుదీనా వాసన ఘాటుగా ఉండడంతో చాలామందికి దాని వాసన అంటే కూడా సరిపోదు. అటువంటప్పుడు ఈ హోమ్ రెమెడీస్ బదులుగా వైద్యున్ని సంప్రదించడం ఎంతో మేలు.