మామూలుగా చాలామందికి ఉదయాన్నే లేవగానే టీ,కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమంది టీ తాగితే మరి కొందరు కాఫీ తాగుతూ ఉంటారు. ఇలా రోజులో కనీసం ఒక్కసారైనా టీ తాగనిది చాలామందికి రోజు గడవదు. ఇంకొంతమంది ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కనీసం నాలుగైదు సార్లు టీ తాగుతూ ఉంటారు. ఇకపోతే చాలా మంది టీ తాగేటప్పుడు అందులో ఎక్కువగా చక్కెరను మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. బెల్లం ఉపయోగించి చాలా తక్కువ మంది తాగుతూ ఉంటారు. ఒకవేళ ఉదయాన్నే బెల్లం టీ తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బెల్లం టీ జీర్ణక్రియకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. బెల్లం టీ లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఒకవేల మీరు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లయితే ప్రతిరోజూ ఉదయం పరగడుపున బెల్లం టీని తాగడం మంచిది. ఇది మీ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అలాగే బెల్లం పోషకాలకు మంచి వనరు అని చెప్పవచ్చు. మనం దీన్ని ఎన్నో విధాలుగా ఉపయోగించవచ్చు. దీనిలో కాల్షియం, విటమిన్ బి, పొటాషియం, ఐరన్ తో పాటుగా ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయ పడతాయి. అలాగే ఇవి లోపలి నుంచి మనల్ని పోషిస్తాయి.
చలికాలంలో రోజూ ఉదయాన్నే బెల్లం టీ ని తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే టీలో చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఉపయోగించడం వల్ల షుగర్ వచ్చే ప్రమాదాలు కూడా తగ్గుతాయట. బెల్లం టీ అయితే షుగర్ వ్యాధి గ్రస్తులు కూడా ఎటువంటి భయం లేకుండా తాగవచ్చుని చెబుతున్నారు. మీరు బరువు తగ్గాలంటే మాత్రం కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినకూడదు. అయితే ఈ సీజన్ లో ప్రతిరోజూ ఉదయం బెల్లం టీని తాగవచ్చు. బెల్లం టీ జీవక్రియను పెంచుతుంది. దీంతో మీరు సులువుగా బరువు తగ్గుతారు. బెల్లం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది పీరియడ్స్ సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. పీరియడ్స్ సమయంలో బెల్లం టీని తాగితే కడుపు నొప్పి, తిమ్మిరి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
note: పైన ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. అందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల తీసుకోవడం మంచిది.