Site icon HashtagU Telugu

Health Tips: వేడి నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Mixcollage 09 Jul 2024 07 41 Am 7322

Mixcollage 09 Jul 2024 07 41 Am 7322

మామూలుగా వైద్యులు గోరువెచ్చని నీరు తాగాలని చెబుతూ ఉంటారు. కానీ అమ్మాయిలు చాలా మంది చల్లనీటినే తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎన్ని వేడి నీళ్లు తాగినా కూడా ఒక్క గ్లాస్ చల్ల నీళ్లు తాగితే చాలు ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. వాటర్ తాగకపోతే అసలు తాగినట్టే అనిపించదు అని ఫీల్ అవుతూ ఉంటారు. కూల్ వాటర్ తాగితేనే నీళ్ళు తాగినట్టు ఉంటుందని భావించే వారు కూడా లేకపోలేదు. కానీ చాలామంది అనుకుంటున్నట్టు కూల్ వాటర్ ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. కూల్ వాటర్ తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి అంటున్నారు వైద్యులు.

అలాగే వేడి నీటిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు అంటున్నారు. మరి వేడి నీళ్ళు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఎప్పుడు మనం తెలుసుకుందాం.. తరచూ వేడి నీరు తాగడం వల్ల మధుమేహం రాదట. ఆర్థరైటిస్ సమస్య ఉత్పన్నం కాదని, కీళ్ల నొప్పులు బాగా బాధించే వారికి, ఆ బాధలు కొంత మేర తగ్గుతాయని చెబుతున్నారు వైద్యులు. వేడి నీళ్లు తాగడం వల్ల కడుపు ఆరోగ్యంగా ఉంటుందని, ఎప్పటికీ కడుపు చెడిపోదని సూచిస్తున్నారు. అయితే వేడి నీళ్లు తాగడం వల్ల ఉదర సమస్యల పరిష్కారం మాత్రమే కాకుండా, గొంతు సమస్యలు కూడా రావని, దగ్గు వచ్చే అవకాశం కూడా లేదని చెబుతున్నారు.

అనేక రకాల చర్మ సమస్యల నుండి కూడా ఉపశమనం దొరుకుతుందని అంటున్నారు వైద్యులు. తరచుగా వేడి నీరు తాగే వారికి జలుబు అంత త్వరగా రాదని చెబుతున్నారు. స్థూలకాయ సమస్యతో బాధపడేవారు వేడి నీళ్లు తాగడం వల్ల ఆ సమస్య నుంచి కొంతమేరకు ఉపశమనం పొందవచ్చు అని అంటున్నారు. అధిక బరువును తగ్గించడంలో వేడి నీళ్లు గణనీయమైన పాత్రను పోషిస్తాయని చెబుతున్నారు. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో, మన శరీర మెటబాలిజం ను పెంచటంలో వేడి నీళ్ళు గణనీయమైన పాత్ర పోషిస్తాయని అంటున్నారు. అయితే వేడి నీళ్లు తాగమన్నారు కదా అని విపరీతంగా ఉండే వేడి నీళ్లను తాగకూడదు.

కేవలం గోరువెచ్చగా ఉన్న నీటిని మాత్రమే తాగడం మంచిది. ఇక నీళ్ళను తాగేటప్పుడు గుటక గుటకగా నీటిని చప్పరిస్తూ తాగాలని సూచిస్తున్నారు. అలాగే ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే చాలా మంది నిమ్మరసం తేనె వేడినీటిలో కలుపుకుని తాగుతారు. అయితే దానికంటే ముందే రెండు మూడు గ్లాసులు గోరు వెచ్చని నీటిని తాగితే మంచిదని సలహా ఇస్తున్నారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే పరగడుపున మూడు గ్లాసులు వేడి నీటిని తాగడం మన శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపించడానికి ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు.

note : ఈ ఆరోగ్య సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అని గుర్తించాలి.