Site icon HashtagU Telugu

Green Tea: స్త్రీలు గ్రీన్ టీ తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Mixcollage 25 Jul 2024 01 18 Pm 1750

Mixcollage 25 Jul 2024 01 18 Pm 1750

ప్రస్తుత రోజుల్లో మనుషులు టీ కాఫీలకు బాగా ఎడిక్ట్ అయిపోయారు. టీ కాఫీలు తాగని వారు గ్రీన్ టీ బ్లాక్ టీ వంటివి తాగుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలామంది గ్రీన్ టీలు ఎక్కువగా తాగుతున్నారు. గ్రీన్ టీ కూడా ఆరోగ్యానికి మంచిది అని చెబుతున్నారు వైద్యులు. మరి గ్రీన్ టీ ని స్త్రీలు తాగవచ్చా? తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గర్భిణీ స్త్రీలు, ఆడవారు తమ సంతానోత్పత్తిని పెంచడానికి రోజూ 200 మి.గ్రా కంటే తక్కువ గ్రీన్ టీ , కెఫిన్ ను తాగాలని చెబుతున్నారు. అంటే మీరు రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీ తాగవచ్చు. ఇది అధిక రక్తపోటు, గుండె జబ్బులు, క్యాన్సర్ రిస్క్ ను నివారించడానికి సహాయపడుతుందట.

అలాగే స్త్రీలు తమ శరీరాన్ని శక్తివంతంగా ఉంచడానికి హెర్బల్ టీలను కూడా తాగవచ్చని చెబుతున్నారు. గ్రీన్ టీలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలోని అవయవాలను సెల్యులార్ దెబ్బతినకుండా రక్షించడానికి సహాయపడతాయట. దీనివల్ల సంతాన లేమి సమస్యలు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందట. అదేవిధంగా గ్రీన్ టీలో విటమిన్ సి కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటుగా ఆక్సీకరణ ఒత్తిడి వల్ల శరీరంలోని కణాలు దెబ్బతినకుండా నిరోధించడానికి సహాయపడుతుందట. కాగా గ్రీన్ టీ ఆకుల్లో మన శరీరానికి అవసరమైన జింక్, క్రోమియం, మాంగనీస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఎక్కువగా లభిస్తాయి.

ఇవి మహిళల శరీరంలో అండోత్సర్గమును మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతాయట. అలాగే ప్రతీ రోజు రోజూ గ్రీన్ టీని తాగితే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో మెటబాలిజంను పెంచుతాయట. ఇది గర్భధారణ సంబంధిత మూడ్ స్వింగ్స్ ను తగ్గించడానికి ఆడవాళ్లకు సహాయపడుతుందని చెబుతున్నారు. చాలా మంది గర్భిణిలకు ఈ సమయంలో వాంతులు అవడం, వికారంగా అనిపించడంతో పాటుగా, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయట. అయితే వీళ్లు గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీలో ఉండే పోషకాలు మహిళల్లో ఎముకలను దృఢంగా ఉంచడానికి సహాయపడతాయట. ఇది హార్మోన్ల హెచ్చుతగ్గుల సమస్యలను కూడా తగ్గిస్తుందట. గ్రీన్ టీని తాగితే ఎమకల సమస్యలు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందట.

note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.