Site icon HashtagU Telugu

Drumstick Water: మునగ నీరు తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా?

Mixcollage 14 Jul 2024 11 21 Am 9140

Mixcollage 14 Jul 2024 11 21 Am 9140

మునగకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మునగకాయలు ఉపయోగించి ఎన్నో రకాల కూరలు కూడా తయారు చేస్తూ ఉంటారు. మునక్కాడ రసం, మునక్కాడ సాంబార్, మునక్కాయ వేపుడు ఇలా చాలా రకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. అయితే మునగ చెట్టులో కేవలం మనకు కాయలు మాత్రమే కాకుండా మునగ ఆకు కూడా ఎంతో మేలు చేస్తుంది. అందుకే చాలామంది మునగ ఆకులు ఉపయోగించి వేపుడు చేసుకుని తింటూ ఉంటారు. ఆ సంగతి అటు ఉంచితే మునగ కాయల వల్ల మాత్రమే కాకుండా మునగ నీరు వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు వైద్యులు.

అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మాములుగా వేసవిలో మనం ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల పండ్లు, కూరగాయలు తింటూ ఉంటాం. కానీ సమ్మర్ లో మనం కచ్చితంగా తినాల్సిన వాటిలో మునగకాయ కూడా ఒకటి. మునగకాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని కూరల్లాగా కాకుండా మునగకాయ నీరు తాగితే చాలా ప్రయోజనాలు కలుగుతాయట. ఆరోగ్యాన్ని చాలా బాగా మెరుగుపరుస్తాయి. మునగ నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో అధిక స్థాయిలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తినీ పెంచుతుంది. వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.

అలాగే ఇది సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. మునగకాయలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరచడం మాత్రమే కాకుండా చర్మ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. అలాగే చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి మునగ నీరు తాగితే రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా వేసవిలో మునగకాయను తీసుకోవడం వల్ల ఇది శరీరాన్ని హైడైటెడ్ గా ఉంచుతుంది. హీట్ స్ట్రోక్ నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ఇంతకీ ఈ మునగ నీరు ఎలా తయారు చేయాలి అన్న విషయానికి వస్తే.. 2 కప్పుల నీటిలో 2 మునగకాయలను మరిగించి, నీరు సగానికి తగ్గినప్పుడు నీటిని కాస్త చల్లార్చి తాగితే సరిపోతుంది. నచ్చితే మునగకాయ కూడా తినవచ్చు.

note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.