Site icon HashtagU Telugu

Curry Leaves Water: పరిగడుపున కరివేపాకు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Curry Leaves Water

Curry Leaves Water

మన ఇంట్లో అలాగే పెరట్లో దొరికే ఆకుకూరల్లో కరివేపాకు కూడా ఒకటి. కరివేపాకును మనం ఎన్నో రకాల కూరలు ఉపయోగిస్తూ ఉంటాం. కూరకు రుచిని పెంచడంతోపాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. కానీ చాలామంది కూరలో కరివేపాకే కదా అని తీసి పక్కకు పారేస్తూ ఉంటారు. కరివేపాకు తినడానికి అస్సలు ఇష్టపడరు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే కరివేపాకు వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. ముఖ్యంగా పరగడుపున కరివేపాకు నీళ్లు తాగడం వల్ల మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.

ఉదయాన్నే పరగడుపున కరివేపాకు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కరివేపాకుతో పాటుగా కరివేపాకు నీరు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన శరీరం ఫిట్ గా ఉండాలంటే మన జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండాలి. అయితే కరివేపాకులో మన జీర్ణశక్తిని పెంచే కొన్ని ఎంజైములు పుష్కలంగా ఉంటాయి. అయితే ప్రతిరోజూ ఉదయం కరివేపాకు నీటిని తాగితే ప్రేగు కదలికలు సులభతరం అవుతాయి. అలాగే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు కూడా దూరమవుతాయని చెబుతున్నారు. అలాగే ప్రస్తుత రోజుల్లో ఒత్తిడి అన్నది సాధారణ సమస్యగా మారిపోయింది. చాలామంది ఒత్తిడి కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్నే కాదు శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది.

అయితే కరివేపాకు ఈ ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది. కరివేపాకు నీటిని తాగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందట. దీంతో మీరు ఎలాంటి ఒత్తిళ్లకు గురికారని చెబుతున్నారు. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. కరివేపాకు నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో మీకు గుండెజబ్బులు వచ్చే ముప్పు చాలావరకు తగ్గుతుందని చెబుతున్నారు. కరివేపాకు డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి రోజూ ఉదయాన్నే కరివేపాకు నీటిని తాగితే బ్లడ్ లో షుగర్ కంట్రోల్ లో ఉంటుందట.

Exit mobile version