Site icon HashtagU Telugu

Ash Gourd: ఏంటి బూడిద గుమ్మడికాయతో బరువు తగ్గవచ్చా? అందుకోసం ఏం చేయాలో తెలుసా?

Ash Gourd

Ash Gourd

బూడిద గుమ్మడికాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. ఇందులో ప్రోటీన్, ఐరన్, జింక్, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి అనేక పోషకాలు కనిపిస్తాయి. ఇందులో చాల తక్కువ కేలరీలు ఉంటాయి. బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుందట. ఇది కేవలం దిష్టి కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందట. మరి బూడిద గుమ్మడికాయ వల్ల కలిగే ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా మనలో చాలా మంది బూడిద గుమ్మడికాయను దిష్టి తీయడానికి ఉపయోగిస్తారు. ఇంటి ముందు, షాపుల ముందు దిష్టి తగలకుండా ఉండటానికి ఇంటి ముందు బూడిద గుమ్మడికాయను వేలాడదీస్తూ ఉంటారు.

అయితే గుమ్మడి కాయ కేవలం దిష్టి తీయడానికి మాత్రమే కాదు ఆయుర్వేదంలో బూడిద గుమ్మడికాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాట. బూడిద గుమ్మడికాయలో ప్రోటీన్, ఐరన్, జింక్, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో చాల తక్కువ కేలరీలు ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుందట. బరువు తగ్గాలనుకునేవారు బూడిద గుమ్మడికాయ జ్యూస్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఈ జ్యూసులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయట. ప్రతి రోజూ పరగడుపున ఈ జ్యూస్ తాగితే ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఎక్కువ తినాలన్నా కోరిక ఉండదు. దీంతో అధిక బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అని చెప్పాలి. రోజూ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుందట.

శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ శరీరం నుంచి సులభంగా తొలగిపోతాయట. అలాగే ఈ రోజుల్లో చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. కడుపు నొప్పి, గ్యాస్, ఎసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే ఇలాంటివారికి బూడిద గుమ్మడికాయ జ్యూస్ బాగా ఉపయోగ పడుతుందట. ఈ జ్యూస్ తాగడం వల్ల కడుపులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందట. అలాగే గట్ ఆరోగ్యం హెల్తీగా ఉంటుందని చెబుతున్నారు.కాగా బూడిద గుమ్మడికాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల పేగులో మలం సులభంగా కదులుతుందట. అందుకే మలబద్ధకం సమస్యతో బాధపడేవారు ఈ జ్యూసును రోజూ తాగడం మంచిదని చెబుతున్నారు.

బూడిద గుమ్మడికాయలో విటమిన్ సి, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయట. అంతేకాకుండా ఈ జ్యూసులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయట. అంతేకాకుండా బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని ద్రవాలు సమతుల్యంగా ఉంటాయని చెబుతున్నారు. దీంతో కిడ్నీల పనితీరు మెరుగుపడుతుందట. కిడ్నీలోని రాళ్ల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. కాగా బూడిద గుమ్మడికాయలో అనేక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయట. రోజూ ఈ జ్యూస్ తాగడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందట. ఈ జ్యూసులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయట. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందట. అంతేకాకుండా ఈ జ్యూస్ తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని,దీంతో సీజనల్ వ్యాధుల్ని తట్టుకునేశక్తి వస్తుందని చెబుతున్నారు.