Site icon HashtagU Telugu

Almond Milk: బాదం పాల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Almond Milk

Almond Milk

బాదంపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. బాదంలో పప్పులు ఎన్నో రకాల ప్రోటీన్లు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బాదంలో విటమిన్ ఇ, విటమిన్ బి, మెగ్నీషియం, డైటరీ ఫైబర్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు మెండుగా ఉంటాయట. కేవలం బాదం పప్పులు తినడం మాత్రమే కాకుండా బాదంపప్పుతో పాలు చేసుకుని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు. బాదం పాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బాదం పాలను చాలా సులువుగా తయారుచేసుకోవచ్చు. ఇందుకోసం రాత్రంతా బాదం పప్పులను నానబెట్టాలి. ఉదయం వీటి తొక్క తీసేసి నీళ్లు పోసి బ్లెండర్ లో వేసి బాగా బీట్ చేయాలి. బాదం పాలు కొంచెం తీయగా కావడటానికి దీనిలో రెండు ఖర్జూరాలను వేయవచ్చు. కాగా ఈ బాదం పాలలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా పుష్కలంగా ఉంటుంది. ఈ పాలను రెగ్యులర్ గా తాగడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుందట. అలాగే మలబద్దకం తగ్గుతుందని చెబుతున్నారు. అలాగే ఎన్నో జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. అలాగే బాదం పాలు మన ఎముకల ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయట. ఈ పాలలో ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన కాల్షియం పుష్కలంగా ఉంటుందని చెబుతున్నారు.

విటమిన్ డి పుష్కలంగా ఉండే బాదం పాలను తాగితే ఎముకల సమస్యలు వచ్చే అవకాశం ఉండదట. అలాగే ఆరోగ్యకరమైన కొవ్వు మెండుగా ఉండే బాదం పాలను రెగ్యులర్ గా తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందట. దీంతో మీకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని చెబుతున్నారు.అలాగే బాదం పాలలో కార్బోహైడ్రేట్లు ఉండవు. అందేకాదు వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మధుమేహం ఉన్న వారు ఎలాంటి భయం లేకుండా ఈ పాలను తాగవచ్చు. ఈ పాలు రక్తలో చక్కెర స్థాయిలను ఎ మాత్రం పెంచవని నిపుణులు చెబుతున్నారు. అలాగే బాదం పాలలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

వీటిన రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందట. దీంతో మీరు ఎన్నో అంటువ్యాదులు, ఇతర రోగాలకు దూరంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు. అలాగే బాదం పాలు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలకు అద్బుతమైన వనరుగా చెప్పవచ్చు. ఈ పాలను మీ రోజువారి ఆహారంలో చేర్చడం వల్ల మీ మెదడు ఆరోగ్యంగా ఉంటుందట. బాదంపాలు తరచుగా తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు. అలాగే రోజూ బాదం పాలను తాగడం వల్ల శరీరంలో విటమిన్ ఇ లెవెల్స్ పెరుగుతాయి. ఇది మీ చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుందట.