Site icon HashtagU Telugu

Dragon Fruit : తరచూ డ్రాగన్ ఫ్రూట్ ని తింటే చాలు.. ఎన్నో లాభాలతో పాటు మందులు వేసుకోవాల్సిన అవసరమే ఉండదు?

Mixcollage 25 Jan 2024 02 43 Pm 2877

Mixcollage 25 Jan 2024 02 43 Pm 2877

ప్రస్తుత రోజుల్లో డ్రాగన్ ఫ్రూట్ ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈ పండు వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్న తర్వాత వీటిని ప్రజలు తరచుగా తినడం మొదలుపెట్టారు. దాంతో మార్కెట్లో వీటికి ఉన్న డిమాండ్ కూడా పెరిగింది. అయితే మనకు డ్రాగన్ ఫ్రూట్లు రెండు కలర్స్ లో ఎక్కువగా లభిస్తాయి అన్న విషయం తెలిసింది. ఒకటి పింక్ కలర్ కాగా మరొకటి వైట్ కలర్. కలర్ ఏదైనాప్పటికీ ఇందులో ఉండే లాభాలు మాత్రం అమోఘం. డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. మరి డ్రాగన్ ఫ్రూట్ కలగడం వల్ల కలిగే ఆ ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇందులో కేలరీలు తక్కువగా, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. పీచు పదార్థం కూడా అధికంగానే ఉంటుంది. ఐరన్, ప్రొటీన్లు, పిండిపదార్థాలు, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ ఇ, కెరోటినాయిడ్లు, పాలీఫెనాల్స్ తదితర విలువైన పోషకాలు లభిస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ ఖరీదు కొంచెం ఎక్కువే అయినా దానికి తగ్గట్లే శరీరానికి శక్తినిచ్చే న్యూట్రియెంట్స్ లభిస్తాయి. సహజంగా మన ఒంట్లో ఫ్రీరాడికల్స్ ఉంటే మనం అనారోగ్యం బారిన పడతాం. డ్రాగన్ ఫ్రూట్ ని తింటే అది ఆ ఫ్రీరాడికల్స్ ని దూరం చేస్తుంది. తద్వారా మనం ఆరోగ్యాన్ని సంతరించుకుంటాం. డ్రాగన్ లో నేచురల్ గా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులను, క్యాన్సర్ ను, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తాయి.

డ్రాగన్ లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు దాదాపు రావని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండో దశకు చేరిన షుగర్ జబ్బును సైతం డ్రాగన్ నియంత్రణలోకి తెస్తుంది. డ్రాగన్ లోని విటమిన్ సి, కెరోటినాయిడ్లు ఇమ్యునిటీని పెంచుతాయి. వైట్ బ్లడ్ సెల్స్ ను కాపాడటం ద్వారా రోగ నిరోధక శక్తిని పెరిగేలా చేస్తాయి. దీంతో అంటువ్యాధులు గానీ ఇతర ఏ జబ్బులు గానీ మన దరి చేరకుండా చూస్తాయి. బాడీలో ఐరన్ లోపిస్తే ఓపిక తగ్గుతుంది. అలాంటి పరిస్థితుల్లో శరీరానికి శక్తి రావాలంటే తిన్న ఆహారం జీర్ణమవ్వాలి. తిండి జీర్ణం కావటానికి ఆక్సీజన్ అవసరం. ఒంటి నిండా ప్రాణ వాయువు సరఫరా కావాలంటే ఐరన్ పుష్కలంగా ఉండాలి. డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇనుము లోపాన్ని అధిగమించవచ్చు. మిగతా అన్ని పండ్లతో పోల్చితే మెగ్నీషియం ఎక్కువగా ఉండేది డ్రాగన్ ఫలంలోనే. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే మెగ్నీషియం తగినంత తగలాలి. బాడీలోని ఇతర బయో కెమికల్ రియాక్షన్స్ కీ ఈ లోహమే కీలకం.