Site icon HashtagU Telugu

Blood Donation: వామ్మో తరచుగా రక్తదానం చేయడం వల్ల ఇన్ని లాభాలు కలుగుతాయా!

Blood Donation

Blood Donation

రక్తదానం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ మనలో చాలామందికి రక్తదానం చేయడం వల్ల కలిగే లాభాల గురించి అసలు తెలియదు. కొంతమంది రక్తం దానం చేయడానికి కూడా భయపడుతూ ఉంటారు. రక్తదానం అద్భుతమైన దానంగా పరిగణిస్తారు. ఎందుకంటే మీరు రక్తదానం చేసినప్పుడు, మీరు మీ రక్తాన్ని దానం చేయడమే కాకుండా ఒకరికి లేదా అంతకంటే ఎక్కువ మందికి జీవితాన్ని ఇస్తున్నట్లు అర్ధం. మీరు ఎవరికైనా నేరుగా రక్తాన్ని అందించినప్పుడు, మీరు దానం చేస్తున్న వ్యక్తి జీవితం రక్షించగలరు.

కానీ మీ సాధారణ రక్తదానం సమయంలో రక్తం కాకుండా దాని నుండి సేకరించిన RBC, ప్లాస్మా వేర్వేరు వ్యక్తులకు బదిలీ చేయగలరు. రక్తదానానికి సంబంధించి మన దేశంలో అనేక రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ ఇప్పటికీ రోగులు తమ అవసరానికి అనుగుణంగా రక్తం పొందలేకపోతున్నారట. అయితే ఇందుకు రక్తదానంపై ప్రజల్లో ఉన్న అపోహలే కారణం అని చెప్పాలి. అలాగే రక్తదానం చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి కూడా కొంతమందికి ఇప్పటికీ అవగాహన లేదు. కాగా ఒక వ్యక్తి రక్తదానం చేసినప్పుడు అతని శరీరం రక్తం కొరతతో బాధపడదట.

ఎందుకంటే రక్తదానం చేసే ముందు వైద్యులు హిమోగ్లోబిన్ స్థాయి, దాత రక్తపోటు వంటి ప్రతి విషయాన్ని చెక్ చేస్తారు. ఒక వ్యక్తి శరీరంలో ఐరన్ లోపిస్తే, అనేక రకాల వ్యాధులు అతన్ని చుట్టుముడతాయట. వాటిలో మొదటిది కణజాల నష్టం, కాలేయం దెబ్బతినడం,శరీరంలో ఆక్సిజన్ సమస్యలు. కానీ సాధారణ రక్తదాతలకు వారి శరీరంలో రెగ్యులర్ ఐరన్ లెవెల్స్ ఉంటాయట. కాలేయ సంబంధిత సమస్యలను నివారించండి, రక్తదానం సహాయపడుతుందట. మీరు ఆరోగ్యంగా ఉండి, జీవితాంతం మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే రక్తదానం చేయడం చాలా మంచిదని చెబుతున్నారు. ఇవే కాకుండా ఒత్తిడి కూడా తగ్గుతుందట. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందట.

ప్రతికూల భావోద్వేగాలను దూరం చేస్తుందని, రక్తదానం చేయడం వల్ల అధిక రక్తపోటు, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. ప్రతి ఆరోగ్యవంతుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చట. ఒకేసారి రక్తదానం చేయడం ద్వారా ముగ్గురు లేదా ప్రాణాలను కాపాడవచ్చట. అలాగే, మీరు ఎవరికైనా ఉపయోగకరంగా ఉన్నారనే భావన మిమ్మల్ని సంతోషంగా ఉంచడంలో సహాయపడుతుందట. ఒకరి ప్రాణాన్ని కాపాడిన ఆనందం మీలో ఆత్మ తృప్తిని నింపుతుంది. ఇది మీ మానసిక ఆరోగ్యానికి చాలా మంచిదట. అయితే రక్త దానం చేయాలి అనుకున్న వారి వయస్సు 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలట. అలాగే రక్తదాత బరువు 45 కిలోల కంటే ఎక్కువగా ఉండాలట. ప్రతి రక్తదానం మధ్య కనీసం మూడు నెలల గ్యాప్ ఉండాలని చెబుతున్నారు.

Exit mobile version