Cycling: రోజూ సైకిల్ తొక్కితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటీ? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి!

సైకిల్ అనేది కేవలం మనం గమ్యం చేరడానికి మాత్రమే కాదు.. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు

  • Written By:
  • Publish Date - August 29, 2022 / 05:00 PM IST

సైకిల్ అనేది కేవలం మనం గమ్యం చేరడానికి మాత్రమే కాదు.. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు సైకిల్ తొక్కడం వల్ల మనలో ఎన్నో కొత్త కొత్త మార్పులు కనిపిస్తాయి. నిజానికి ఒకప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర సైకిల్ ఉండేది. కానీ రాను రాను కనిపించకుండా పోతున్నాయి.

అప్పట్లో ఇంటికి ఒక సైకిల్ కచ్చితంగా ఉండేది. కానీ వస్తున్న కొత్త కొత్త టెక్నాలజీ వల్ల పాత పరికరాలు, పాత వస్తువులు అంతరించిపోయాయి. ఇక టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి చాలా అనారోగ్య సమస్యలు కూడా తలెత్తాయి. ఎంత టెక్నాలజీ పెరిగితే అంత అనారోగ్య సమస్య అన్నట్లుగా మారింది ఈ ప్రపంచం తీరు.

ఇప్పుడు మొత్తం మోటార్ బైకులు, కారులు అందుబాటులో ఉండేసరికి సైకిల్ తొక్కడం మానేశారు జనాలు. కానీ సైకిల్ తొక్కడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక ఈ కాలంలో చాలామంది అధిక బరువు పెరగటంతో జిమ్ కి వెళ్లి అక్కడ ఉన్న సైకిల్ తొక్కుతూ బరువు తగ్గించుకుంటున్నారు.

కానీ ఒకప్పుడు మన దగ్గర ఉండే సైకిల్ మాత్రం కేవలం బరువు కోసమే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలను దరచేరనిచ్చేది కాదు. కాబట్టి సైకిల్ తొక్కడం వల్ల ఎటువంటి సమస్యలు రావంటే.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో చెడు కొవ్వు కరిగిపోతుంది. ఇక రోగ నిరోధక శక్తి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి, డిప్రెషన్, హైబీపీ లాంటివి తగ్గుతాయి. మెదడు పనితీరు మెరుగు పడుతుంది. శరీరంలో వ్యర్ధాలు బయటికి పోతాయి. మానసికంగా ప్రశాంతత ఉంటుంది. షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.