వేసవి కాలం(Summer) రాగానే మామిడి పండ్లు(Mangoes) ఎలా ఎక్కువగా వస్తాయో అదే విధంగా శీతాకాలం(Winter) రాగానే సీతాఫలాలు(Custard Apple) ఎక్కువగా వస్తాయి. అయితే సీతాఫలాలు తినడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది. డాక్టర్లు ఇంకా మన పెద్దవారు చెప్పే మాట ఏ కాలంలో వచ్చే పండ్లను ఆ కాలంలో తినాలి. అది మన ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు విరివిగా లభించే సీతాఫలాలు తినడం వలన మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) ఉన్నాయి.
* సీతాఫలాలలో ఉండే విటమిన్ ఎ మన కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కంటి చూపు సమస్యలను తగ్గిస్తుంది.
* సీతాఫలాల్లో ఉండే విటమిన్ సి మన శరీరంలో రోగనిరోధకతను పెంచి చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు( జలుబు, దగ్గు, జ్వరం) రాకుండా కాపాడుతుంది.
* సీతాఫలం తినడం వలన మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెరగకుండా చేస్తుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడేలా చేస్తుంది.
* సీతాఫలం తినడం వలన జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
* సీతాఫలంలో ఉండే విటమిన్ బి మన శరీరంలో రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది.
* సీతాఫలం తినడం వలన మనకు చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి.
* సీతాఫలం తినడం వలన అది మన జీర్ణ వ్యవస్థను క్రమబద్దీకరిస్తుంది.
* సీతాఫలంలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.
* సీతాఫలం ఆస్తమాను పేషంట్స్ కి కొంత ఊరట ఇస్తుంది.
* సీతాఫలం తినడం వలన మనకు వచ్చే వాపులు, నొప్పులు కూడా తగ్గుతాయి.