Cucumber: కీర దోసకాయ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే?

కీర దోసకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. మిగతా సీజన్ లతో పోల్చుకుంటే వేసవిలో ఈ కీరదోసకాయలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వైద్యులు కూడా వేసవి కాలంలో కీర దోసకాయలు తినమని చెబుతూ ఉంటారు. ఇందులో నీటి శాతం ఎ

  • Written By:
  • Publish Date - July 2, 2024 / 08:00 AM IST

కీర దోసకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. మిగతా సీజన్ లతో పోల్చుకుంటే వేసవిలో ఈ కీరదోసకాయలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వైద్యులు కూడా వేసవి కాలంలో కీర దోసకాయలు తినమని చెబుతూ ఉంటారు. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇది మన శరీరాన్ని డిహైడ్రెషన్ కాకుండా జాగ్రత్త పడేలా చేస్తుంది. కాగా కీర దోసకాయ తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కీరా అనేక పోషకాలను కలిగి ఉంటాయి.

కీర దోస తింటే శరీరంలో జీవక్రియ కూడా సక్రమంగా జరుగుతుంది. అలాగే కీరదోసలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధక సమస్యను రాకుండా చేస్తోంది. అలాగే మన శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లను కూడా బయటకు పంపిస్తుంది. కీర దోసలో విటమిన్ కె ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడం లో ఎముకలు పటుత్వాన్ని కోల్పోకుండా కాపాడటంలోనూ ఉపయోగపడుతుంది. అలాగే కీరదోసకాయలో లారిసెరిసినాల్, పినోరేసినాల్, సెకోయుసోరిసినాల్, అనే లిగ్నన్లు అండాశయ, గర్భాశయ ప్రోస్ట్రేట్ క్యాన్సర్లను నివారించడంలో ఎంతో బాగా ఉపయోగ పడతాయి. అదేవిధంగా కీరదోసలో ఉండే విటమిన్లు బ్లడ్‌ ప్రెజర్‌ను తగ్గించి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తాయి.

దీనిలో ఉండే విటమిన్‌ బి తలనొప్పిని వెంటనే తగ్గించి ప్రశాంతంగా ఉండేలా ఉపయోగపడుతుంది. కీర దోసను జ్యూస్‌గా చేసుకుని తాగడం వల్ల కడుపులో పుండ్లు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా వేసవిలో కీరదోసను తీసుకోవడం వల్ల దాహం తక్కువగా ఉంటుంది. కీరదోస ముక్కలుగా చేసి కళ్లపై ఉంచుకోవడం వల్ల కళ్ల మంటలు, ఎరుపులు తగ్గి, కళ్లు కాంతివంతంగా కనిపిస్తాయి.