ఈ వానాకాలం(Rainy Season)లో అందరూ వాన పడుతున్నప్పుడు వేడి వేడిగా కాల్చిన లేదా ఉడకపెట్టిన మొక్కజొన్న(Corn) తినడం చేస్తూ ఉంటారు. ఇవి రుచిగా ఉండడమే కాకుండా వీటిని తినడం వలన మంచి పోషకాలు అందుతాయి. మొక్కజొన్న గింజల్లో నీటిలో కరుగని పీచు ఎక్కువగా ఉంటుంది. మొక్కజొన్నను ఉడికించి తినవచ్చు లేదా కాల్చుకొని తినవచ్చు. కార్న్ ఫ్లాక్స్, పాప్ కార్న్(Pop Corn) రూపంలో తినవచ్చు. ఇలా ఏ విధంగా అయినా మొక్కజొన్నను తినవచ్చు.
మొక్కజొన్న లోపలి భాగం మెత్తగా ఉండి మనకు తొందరగా జీర్ణం అవుతుంది. మొక్కజొన్న పైన భాగం తొందరగా జీర్ణం అవ్వదు. అందుకే మనం ఎప్పుడైనా ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకూడదు అలా తింటే కడుపులో నొప్పిగా అనిపిస్తుంది. కాబట్టి మితంగా తింటే మన ఆరోగ్యానికి మంచిది మనకు మలబద్దకం రాకుండా చేస్తుంది. మొక్కజొన్నలోని పీచు పదార్ధం మన పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఈ బ్యాక్టీరియా శరీరంలో మొక్కజొన్నను కొవ్వు ఆమ్లాలుగా మారుస్తుంది. ఇది పెద్ద పేగు క్యాన్సర్ వంటివి రావడాన్ని తగ్గిస్తుంది.
ఒక పొత్తు మొక్కజొన్న గింజల్లో 900 మైక్రోగ్రాముల యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చూపు మెరుగుపరచడానికి, కంటి ఆరోగ్యం మెరుగవ్వడానికి ఉపయోగపడతాయి. గుండె జబ్బు, క్యాన్సర్ల వంటివి రావడాన్ని తగ్గిస్తుంది. ఇవి మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ను పెంచుతాయి. మొక్కజొన్నలో యుబిక్వినోన్ అనే విటమిన్ ఉంటుంది అది మన శరీరంలో గుండెకు ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడుతాయి. మొక్కజొన్నలో గ్లూటెన్ ఉండదు. సీలియాక్ జబ్బు గలవారికి మొక్కజొన్న తినడం ఆరోగ్యానికి మంచిది. కాబట్టి వర్షాకాలంలో ఎక్కువగా దొరికే ఈ మొక్కజొన్నని సరదాగా సాయంత్రం పూట ఉడకపెట్టుకొని లేదా కాల్చుకొని తినేయండి.
Also Read : Coconut: కొబ్బరికాయలో పువ్వు కనిపించిందా.. అది దేనికి సంకేతమో తెలుసా?