కొత్తిమీరను..సహజంగా కూరల్లో మారినేట్ చేసేందుకు ఉపయోగిస్తుంటారు. కొంతమంది కొత్తిమీర చట్నీ కూడా చేసుకుంటారు. కానీ వంటకాల్లో వేసే కొత్తిమీరను తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే కొంతమంది కొత్తిమీరను వంటల్లో వేస్తే తినడానికి ఇష్టపడరు. కానీ ఇందులో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉన్నాయి. అనేక అనారోగ్య సమస్యలను కూడా కొత్తిమీర సాయంతో నయం చేసుకోవచ్చని ఆఫ్రికన్ జర్నల్ ఆఫ్ ప్లాంట్ సైన్ చెబుతోంది. నిద్రలేమి సమస్యకు చికిత్స చేసేందుకు ఇరాన్ లో పురాతన ఔషదంగా ఉపయోగించారట. చర్మం, జుట్టును అందంగా మార్చడంలోతోపాటు పొట్టలోని సమస్యలన్నింటినీ దూరం చేస్తుంది.
1. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు
కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒక రకమైన సహజ అణువులు. ఇవి మన శరీరంలో ఉండే హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేయడంలో సహాయపడతాయి. మెడికల్ న్యూస్ టుడే ప్రకారం…యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, ఆర్థరైటిస్, స్ట్రోక్, శ్వాసకోశవ్యాధులు, బలహీనమైన రోగనిరోధకశక్తి, పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని పేర్కొంది.
2. ఒత్తిడి తగ్గించడంలో
నిద్రలేమి సమస్యకు చికిత్స అందించడానికి కొత్తిమీరను ఇరాన్ లో పురాతన ఔషధంగా ఉపయోగించారని ఆఫ్రికన్ జర్నల్ ఆఫ్ ప్లాంట్ సైన్స్ వెల్లడించింది. నొప్పి నివారిణి, కండరాల సడలింపునకు ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాదు ఒత్తిడిని కలిగించే నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను తొలగిస్తుంది.
3. కొలెస్ట్రాల్, మధుమేహం నియంత్రణలో
నేటికాలంలో షుగర్, రక్తపోటు, కొలెస్ట్రాల్ సాధారణ వ్యాధులుగా మారాయి. మన జీవన శైలి కారణంగానే ఈ వ్యాధుల బారిన పడుతున్నాం. కొత్తిమీరలో ఉండే ఔషధగుణాలు, విటమిన్లు ఏ, సి, కెతోపాటు అనేక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఈ వ్యాధులు డెవలప్ కాకుండా అడ్డుకునేందుకు పనిచేస్తాయి.
4. శరీరాన్ని చల్లబరుస్తుంది
వేసవిలో కొత్తమీర జ్యూస్ శరీరాన్ని చల్లబరస్తుంది. మూత్రపిండాలను డిటాక్స్ చేస్తుంది. శరీరంలో డీహైడ్రెట్ నుంచి కాపాడుతుంది.
5. జట్టు, చర్మం
కొత్తిమీరలో ఉండే ఐరన్, యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మన చర్మాన్ని మొటిమలతో పోరాడేందుకు సహాయపడతాయి. ఇందులో అనేక విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు ఆరోగ్యంగా, పెరుగుదలలో సహాయపడుతుంది. హెయిర్ ఆయిల్లో కొత్తిమీర కలిపి జుట్టుకు రాసుకుంటే జుట్టు రాలడం ఆగిపోతుంది.