Leftover Rice: ఇదివరకటి రోజుల్లో మన పెద్దలు రాత్రిళ్ళు మిగిలిపోయిన చద్ది అన్నాన్ని మరుసటి రోజు ఉదయాన్నే తినేవారు. లేదంటే రాత్రి మిగిలిపోయిన అన్నం లో కొద్దిగా పెరుగు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ వేసి ఉంచి దానిని మరుసటి రోజు ఉదయాన్నే తినేవారు. ఇలా తినడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సైతం చెబుతూ ఉంటారు. అయితే కాలం మారిపోయింది. ఉదయం చేసిన ఆహారాన్ని సాయంత్రం లేదా మధ్యాహ్నం తినని వాళ్ళు కూడా ఉన్నారు.
ఎప్పటికప్పుడు విడివిడిగా చేసుకుని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఆ సంగతి పక్కన పెడితే రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఉదయాన్నే తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ చద్దాన్నాన్ని ఈ మధ్య చాలా మంది ఫర్మెంటెడ్ రైస్ అని పిలుస్తున్నారు. అంటే రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని కొద్దిగా నీటిలో నానపెట్టి ఉదయాన్నే అందులో ఒక స్పూన్ పెరుగు కలిపి తింటారు. రాత్రంతా నానపెట్టి తినడం వల్ల విటమిన్ బి, ప్రోబయోటిక్స్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పెరుగుతాయట. మంచి విటమిన్లు, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉండే ఈ చద్దన్నం తినడం వల్ల చాలా అద్భుత ప్రయోజనాలు కలగుతాయట.
మరీ ముఖ్యంగా శరీరంలో వేడి తగ్గుతుందని, అంతేకాదు నీరసం ఉండదని, రోజంతా చాలా ఎనర్జిటిక్ గా ఉంటారని, అలసట అనేదే ఉండదని చెబుతున్నారు. కాగా వీటిలో ఉండే ప్రో బయోటిక్స్ కడుపులో మంచి బాక్టీరియా పెంచుతుందట. పేగు ఆరోగ్యం మెరుగుపడుతుందని, జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు. అజీర్ణ సమస్యలు, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయట. మలబద్దకం సమస్య తగ్గిపోతుందట. రక్తపోటును నియంత్రిస్తుందని, పొటాషియం అధికంగా ఉండటం వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుంది. డీ హైడ్రేషన్ సమస్య ఉండదని చెబుతున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం మంచిదట. ఈ అన్నానికి పెరుగు, మజ్జిగ, ఉల్లిపాయ లాంటివి కలిపి తింటే రుచికి రుచితో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని,అయితే బ్లడ్ షుగర్ ఉన్నవారు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు తినే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది అని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
Leftover Rice: రాత్రి మిగిలిపోయిన అన్నం తింటున్నారా.. అయితే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Leftover Rice