అల్లం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. అల్లం ని ఎన్నో రకాల వంటలు తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఘాటైనా వాసన రుచిని కలిగి ఉండడంతో పాటు ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. అయితే అల్లంని ప్రతిరోజు తీసుకుంటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమెటరీ గుణాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట.
ఆకలిని పెంచడంలో అల్లం బాగా సహాయపడుతుందట. ముఖ్యంగా కీమోథెరపీ, రేడియోథెరపీ, క్యాన్సర్ బాధితులకు ఆకలి తగ్గిపోతుందని, అలాగే ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి కొన్నిసార్లు ఆకలిగా కూడా అనిపించదు అని చెబుతున్నారు. అయితే అలాంటి వారికి నీళ్లల్లో నిమ్మరసం, అల్లం కలిపి ఇవ్వడం వల్ల ఆకలి పెరుగుతుందట. అలాగే అల్లం జీర్ణ క్రియను మెరుగుపరచడంతో పాటు మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుందట. శరీరంలో ఉండే అదనపు కొవ్వు కరిగించి బరువు తగ్గడంలో కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందట. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందట.
జలుబు, దగ్గు, తలనొప్పి, మైగ్రేన్, నడుంనొప్పి, వెన్ను పూస నొప్పి, మోకాలి నొప్పులు, జాయింట్ పెయిన్స్ వంటి సమస్యలను తగ్గించడానికి అల్లం బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. ఇందులో నొప్పి, వాపును తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. రోజుకు 2 నుంచి 5 గ్రాముల అల్లంను రెండు వారాల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందట. అల్లం రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు వ్యాధుల నుంచి కూడా శరీరంని రక్షిస్తుందట. అలాగే చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు జుట్టును బలంగా ఒత్తుగా కూడా ఉంచుతుందని చెబుతున్నారు.
ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచడంలో ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుందట. ఆరోగ్యాన్ని మెరుగుపరచే ఈ సహజ ఔషధాన్ని మీ రోజువారీ జీవనశైలిలో చేర్చుకోవడం మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తుందట. ఉదయం ఖాళీ కడుపుతో అల్లం తినడం లేదా అల్లం నీరు తాగడం శరీర డిటాక్స్ కు సహాయపడుతుందని, ఒక నెలపాటు ప్రతిరోజూ అల్లం తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని, అల్లంలోని పదార్థాల వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్‌ల పరిమాణం కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.