Site icon HashtagU Telugu

‎Banana-Milk: రాత్రిపూట పాలు,అరటిపండు కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Banana Milk

Banana Milk

‎Banana-Milk: మనం తరచుగా తీసుకోవాల్సిన ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలలో అరటిపండు పాలు కూడా ఒకటి. ఈ రెండింటి కాంబినేషన్ ని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. పాలను, అరటిపండును ఉదయాన్నే తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరూ వీటిని విడిగానే తింటుంటారు. కానీ రాత్రిపూట అరటిపండును పాలలో కలిపి తింటే పురుషులకు మంచి లాభాలు కలగడంతో పాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాల కలుగుతాయి అని చెబుతున్నారు. పాలు, అరటిపండు కాంబినేషన్ పురుషుల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందట.

‎పాలు, అరటిపండు రెండింటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అరటిపండులో విటమిన్ ఎ, విటమిన్ బి , విటమిన్ సి, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇకపోతే పాలలో విటమిన్ ఎ, విటమిన్ డి, ప్రోటీన్, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయట. అరటి, పాలలో ఉండే ఈ పోషకాలన్నీ మన ఆరోగ్యానికి మెంతో మంచివని చెబుతున్నారు.
‎ఎప్పుడూ అలసిపోయినట్టుగా, బలహీనంగా ఉండే మగవారు రాత్రిపూట గ్లాస్ పాలలో ఒక అరటిపండు వేసుకుని తింటే చాలా మంచిదట.

‎ఎందుకంటే ఈ కాంబినేషన్ వారి ఒంట్లో శక్తి స్థాయిలను పెంచుతుందని, బలహీనతను తొలగిస్తుందని చెబుతున్నారుఅధిక రక్తపోటు ప్రాణాలను చాలా ప్రమాదకరం. కాగా రాత్రిపూట పాలలో అరటిపండును వేసుకుని పడుకునే ముందు తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుందట. ఆరోగ్యం కూడా బాగుంటుందని చెబుతున్నారు. అరటిపండు, పాలు రెండింటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుందట. ఇది హై బీపీని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. మరీ బక్కగా ఉన్నామనే వారికి కూడా ఈ కాంబినేషన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందట. వీళ్లు రాత్రి పడుకునే ముందు గ్లాస్ పాలలో ఒక అరటిపండును వేసుకుని తింటే బరువు పెరుగుతారట. దీనికోసం ఒక గ్లాసు పాలలో అరటిపండు, తేనె, డ్రై ఫ్రూట్స్ కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.

‎మగవారి జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా పాలు, అరటిపండు బాగా సహాయపడతాయట. పాలు, అరటిపండులో ఉండే ఫైబర్, విటమిన్లు, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయట. అంతేకాదు రాత్రి పడుకునే ముందు పాలలో అరటిపండును వేసుకుని తింటే మలబద్దకం, ఎసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గిపోతాయని చెబుతున్నారు. పని ఒత్తిడి, ఇంటి బరువు బాధ్యతల వల్ల మగవారు బాగా ఆలోచిస్తుంటారు. దీనివల్ల రాత్రిపూట మగవారికి నిద్ర పట్టదు. మీరు కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటుంటే మాత్రం రాత్రిపడుకునే ముందు ఖచ్చితంగా ఒక గ్లాసు పాలు, ఒక అరటిపండును తినడం మంచిదని చెబుతున్నారు. కాగా ఈ రెండింటిలో ఉండే పోషకాలు నిద్రలేమి సమస్యను తగ్గిస్తాయట. మీకు రాత్రిళ్లు బాగా నిద్రపట్టేటా చేయడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version