Site icon HashtagU Telugu

Diabetes: కొబ్బరి నూనె వల్ల షుగర్ పెషేంట్లకు కలిగే ప్రయోజనాలో గురించి మీకు తెలుసా?

Mixcollage 07 Feb 2024 01 47 Pm 8374

Mixcollage 07 Feb 2024 01 47 Pm 8374

ఈ రోజుల్లో చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ డయాబెటిస్ కారణంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం, తగ్గడం లాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. రక్తంలో షుగర్ లెవల్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎన్నో రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే రకరకాల మెడిసిన్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే డయాబెటిస్ ఉన్నవారు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని అన్న కూడా సంకోచిస్తూ ఉంటారు.

అయితే డయాబెటిస్ పేషెంట్లకు కొబ్బరి నూనె ఎంతో బాగా పనిచేస్తుంది అంటున్నారు నిపుణులు. మరి కొబ్బరి నూనె వల్ల డయాబెటిస్ పేషెంట్లకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా షుగర్ ఉన్న వాళ్లు ఈ వంట నూనెల కన్నా.. కొబ్బరి నూనెను వంటనూనెగా వాడుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మన దేశంలోని కేరళ రాష్ట్రంలో ఎక్కువ మంది కొబ్బరి నూనెతోనే వంటలు చేసుకుంటారు. కొబ్బరి నూనెతో వంట చేయడం వల్ల రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ నూనెతో వంట చేసుకొని తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్టరాల్ ను అది తగ్గిస్తుంది.

అలాగే మన శరీరానికి హాని చేసే ట్రైగ్లిజరైడ్లను కూడా కొబ్బరి నూనె తగ్గిస్తుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంతో శరీరానికి కావాల్సిన ఇన్సులిన్ ఈ కొబ్బరి నూనె ద్వారానే వస్తుంది. దీంతో షుగర్ లేవల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి. కాబట్టి ఇకమీదట షుగర్ పేషెంట్లు వంటల కోసం సన్ఫ్లవర్ ఆయిల్,పామాయిల్ వంటి బయట దొరికే ఆయిల్స్ ని కాకుండా కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.