Site icon HashtagU Telugu

Coconut Milk: కొబ్బరి పాల వల్ల కలిగే లాభాలు తెలిస్తే తాగకుండా అస్సలు ఉండలేరు?

Mixcollage 18 Feb 2024 04 01 Pm 5162

Mixcollage 18 Feb 2024 04 01 Pm 5162

మామూలుగా మనం కొబ్బరి తింటూ ఉంటాం. కొందరు పచ్చి కొబ్బరి తింటూ ఉంటారు. ఇంకొందరు మాత్రం పచ్చి కొబ్బరిని పాల రూపంలో చేసుకొని అలా కూడా తాగుతూ ఉంటారు. కొబ్బరి పాలను కూరల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా కొబ్బరిపాలను ఎన్నో విధాలుగా తీసుకుంటూ ఉంటారు. కొందరు మాత్రం అలా తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కొబ్బరి పాల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల ముఖంపై మొటిమలు మచ్చలు వంటి అందానికి సంబంధించిన సమస్యలు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. కాగా మొటిమలు మచ్చలు వంటి సమస్యలతో బాధపడేవారు, నీటిలో కొద్దిగా రోజు వాటర్ కొబ్బరి పాలు కలిపి మిశ్రమాన్ని స్నానానికి ఉపయోగించాలి.

ఈ విధంగా చేయడం వల్ల బాగా పాడైన చర్మం కూడా తిరిగి తాజాదనాన్ని సంతరించుకుంటుంది. కావాలనుకుంటే కొబ్బరి పాలను నేరుగా చర్మానికి అప్లై చేసుకొని నెమ్మదిగా మర్దన చేసుకోవచ్చు. చర్మానికి తేమ అందడంతో పాటు చాలా సాఫ్ట్ గా మారుతుంది. అంటే చర్మానికి కొబ్బరి పాలు సాహసిద్ధంగా మాయిశ్చరైసర్ గా క్లీనర్ గా కూడా పనిచేస్తుంది. దుమ్ము దూలితో పాటు కాలుష్యం ప్రభావంతో చర్మం కల కోల్పోతుంది. కొన్ని గులాబీ రేకులు పాలను బకెట్ గోరువెచ్చని నీటిలో వేసుకొని స్నానం చేయాలి. దాని వల్ల శరీరానికి తగిన తేమా అంది కాంతివంతంగా తయారవుతుంది. కొబ్బరిపాలతో మనకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. పాలను తరచూ తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలను పొందొచ్చు. దీనిలో ఫాస్ఫరస్, కాల్షియం పోషకాలు ఎక్కువగా ఉండడంతో ఎముకలకు సంబంధించిన మేలు చేస్తుంది మధుమేహ వ్యాధిగ్రస్తులకు దోహదపడుతుంది.

ఇది రక్తంలో చక్కెర నిల్వలు తక్కువగా ఉన్న వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆర్థరైటిస్ కు చక్కని మందుగా పని చేస్తాయి. రోజుకొక కప్పు కొబ్బరి పాలను తీసుకుంటే రక్తహీనత తొలగిపోతుంది. అలాగే ఇది వెంట్రుకలు రాలకుండా సహాయపడుతుంది. కొబ్బరి పాలలో నిమ్మరసం కలిపి ఫ్రిజ్లో రెండు నుంచి మూడు గంటల పాటు ఉంచాలి. అనంతరం బయటకు తీసి దాని పైన ఏర్పడిన పొరను తొలగించాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మాడుకు పట్టించి వేడి నీటిలో ముంచిన టవల్ను తలకు చుట్టాలి. గంట సేపు అలాగే ఉంచి షాంపుతో తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తూ ఉంటే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. అలాగే కొబ్బరి పాలు బరువు తగ్గడానికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాదు ఎక్కువసేపు ఉన్న ఆకలి వేయదు. దీంతో ఇవి బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడతాయి. యాంటీ మైక్రోబెల్, యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు కొబ్బరిపాలలో సమృద్ధిగా ఉన్నాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి..

Exit mobile version