Coconut Milk: కొబ్బరి పాల వల్ల కలిగే లాభాలు తెలిస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు?

కొబ్బరికాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. కొబ్బరి బోండం లో ఉండే నీరు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే అందులో ఉం

  • Written By:
  • Publish Date - February 1, 2024 / 06:30 PM IST

కొబ్బరికాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. కొబ్బరి బోండం లో ఉండే నీరు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే అందులో ఉండే కొబ్బరి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చి కొబ్బెర వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరినీరు వేసవికాలంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ నీరసం అలసట వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. మామూలుగా కొందరు పచ్చి కొబ్బరి తో పాలను కూడా చేసుకొని తాగుతూ ఉంటారు. పచ్చికొబ్బరిని బాగా శుభ్రంగా కడిగి మిక్సీ చేసుకుని ఆ పాలను తాగుతూ ఉంటారు. అయితే ఈ కొబ్బరి పాల వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఒక్కసారి తాగారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు.

కొబ్బ‌రి పాల‌లో కూడా అధికంగా పోష‌కాలు ఉంటాయి. కొబ్బ‌రి పాలు అనేక ఆరోగ్య స‌మ‌స్య‌ల నుండి కాపాడతాయి. మరి కొబ్బరి పాల వల్ల ఇంకా ఏ ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప‌చ్చి కొబ్బ‌రిని తిసుకొని దానిని బాగా తురుముకొని ఆ త‌రువాత ఒక మిక్సీ గిన్నెను తిసుకొని,దానిలో తురిమిన కొబ్బ‌రిని అందులో వేసి, కొద్దిగా నీరు పోసి మీక్సి ప‌టుకొని, ఆ మిశ్ర‌మాన్ని వ‌డ‌పోసి పాల‌ను తిస్తారు. అయితే కొబ్బ‌రి పాల‌లో విట‌మిన్ సి, విట‌మిన్,ఇ, విట‌మిన్ బి, బి1,బి3, బి5, బి6, ఐర‌న్, కాల్షియం , సెలీనియం, భాస్వ‌రం, మెగ్నీషియంలు వంటివి పుష్క‌లంగా ఉంటాయి. ఈ పాల‌ను స్వీట్స్ అలాగే అనేక ఇత‌ర వంట‌కాల‌లో ఉప‌యోగిస్తారు.

కాగా కొబ్బరి పాల‌లో కాల్షియం, భాస్వ‌రం ఉండ‌టం వ‌ల‌న అవి శ‌రిరంలోని ఎముక‌ల‌ను బ‌లంగా చేస్తాయి. పాల‌లో కొవ్వుల‌ను క‌రిగించే పొష‌కాలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో స‌హ‌య‌ప‌డుతుంది. కొబ్బరి పాల‌లో యాంటీ ఫంగ‌ల్ , యాంటీ వైర‌ల్ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. ఇది రోగ‌నీరోద‌క శ‌క్తిని పెంచ‌డ‌మే కాక శరీరంలో బ్యాక్టీరియాల‌ను, వైర‌స్ ల‌తో పోరాడ‌టానికి స‌హ‌య‌ప‌డుతుంది. కొబ్బ‌రి పాలు తాగితే కొన్ని ర‌కాల‌ వైర‌ల్ ఇన్ఫెక్ష‌న్స్ కూడా మ‌టుమాయం అవుతాయి. కొబ్బరిపాల‌లో మెగ్నీషియంలు అధికంగా ఉండ‌టం వ‌ల‌న ఖండ‌రాల‌ను ధృఢంగా చేస్తాయి. దీనిలో ఫైబ‌ర్ అధికంగా ఉండ‌టం వ‌ల‌న శ‌రిరంలోని కొవ్వుల‌ను క‌రిగించి , శ‌రిరం బ‌రువును త‌గ్గిస్తుంది. కోబ్బ‌రి పాల‌తో జుట్టుని 5 నిమిషాలు పాటు మ‌సాజ్ చేస్తే జుట్టు బ‌లంగా,సిల్కిగా,న‌ల్ల‌గా మారి జుట్టు కూడా బాగా పెరుగుతుంది. జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.