కొబ్బరి బోండం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కేవలం కొబ్బరి వల్ల మాత్రమే కాకుండా కొబ్బరి నీళ్ల వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే కొబ్బరి పువ్వు వల్ల కూడా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొబ్బరి పువ్వు ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగించడంతో పాటుగా అనేక సమస్యలను కూడా తగ్గిస్తాయని చెబుతున్నారు. కొబ్బరిపువ్వులో విటమిన్ సి ఉంటుంది. ఇది అన్ని శరీర కణజాలా పెరుగుదల, అభివృద్ధి, మరమ్మత్తుకు అవసరం. ఇందులో ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి అనేక ముఖ్య ఖనిజాలు పుష్కలంగా ఉంటాయట. అలాగే ఇందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది.
ఇది సాధారణ ప్రేగు కదలికల్ని పెంచి మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగ్గా చేస్తుందట. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలి నష్టం నుండి కణాలను రక్షిస్తాయట. వీటితోపాటు కాల్షియం, పాస్ఫరస్, పొటాషియం, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలు కలుగుతాయట. షుగర్ ని తగ్గించుకోవడం కోసం కొబ్బరి పువ్వు తింటే ఇన్సులిన్ సెన్సేషన్ ని సంతృప్తి పరిచి నియంత్రిస్తుందట. ఈ పువ్వుని తింటే రక్తంలో చక్కెర తగ్గడమే కాకుండా, బ్రెయిన్, ఎముకలకి చాలా మంచిదని చెబుతున్నారు.
అలాగే కొబ్బరి పిండిని కూడా మనం వాడవచ్చట. దీనిలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. గోధుమ, మొక్కజొన్న వంటి పిండితో పోలిస్తే ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయట. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలపై తక్కువ ప్రభావాన్ని చూపిస్తుందని, కాబట్టి షుగర్ ఉన్నవారికి చాలా మంచిదని చెబుతున్నారు. కొబ్బరి పువ్వును గర్భిణీ స్త్రీలు తీసుకోవడం వల్ల గర్భాశయ శుభ్రతకి మంచిదట. గర్భధారణ సమయంలో గర్భాశయ ఆరోగయానికి చలా మంచిది. వెన్నునొప్పి కూడా తగ్గుతుంది. ప్రెగ్నెన్సీలో వచ్చే వెన్నునొప్పిని తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది. అదే విధంగా, కొబ్బరిపూలలో ఎక్కువ ఫైబర్ ఉంటుందట. దీని కారణంగా జీర్ణక్రియ కూడా మెరుగవుతుందట.. చర్మం, జుట్టుని కూడా చక్కగా, అందంగా చేస్తుంది. గర్భధారణ టైమ్‌లో వచ్చే హార్మోన్ల మార్పుల కారణంగా వచ్చే జుట్టు, చర్మ సమస్యల్ని దూరం చేస్తాయని చెబుతున్నారు. కొబ్బరిపువ్వులో యాంటీ ఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయట..ఇందులో ఫైబర్, పొటాషియంలు ఉంటాయి కొబ్బరి పూలని తినడం వల్ల ఎక్కువ బరువు ఉన్నవారిలో రక్తంలో రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయట. అధిక రక్తంలో చక్కెర, అధిక కొలెస్ట్రాల్ రెండూ గుండె జబ్బులకి కారణాలు. కాబట్టి, కొబ్బరిని తింటే ఈ రెండూ కూడా పరిష్కారమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.