Site icon HashtagU Telugu

Cloves: అన్నం తిన్న తర్వాత లవంగాలు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Cloves

Cloves

మన వంటింట్లో దొరికే మసాలా దినుసుల్లో ఒకటైన లవంగాల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. లవంగాలు కేవలం కూరని రుచిని పెంచడం మాత్రమే కాకుండా ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఆయుర్వేదంలో ఎప్పటి నుంచో లవంగాలను వినియోగిస్తూనే ఉన్నారు.. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. లవంగాలు ప్రతి వంటింట్లో ఉపయోగించే సాధారణ మసాలా దినుసు. లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి దగ్గు, జ్వరం, కఫాన్ని తగ్గిస్తాయి. లవంగాలు వైరస్ లు, బ్యాక్టీరియా, వివిధ రకాల శిలీంధ్రాలు మొదలైన వాటికి వ్యతిరేకంగా పని చేస్తాయి.

లవంగాలను మరిగించిన నీటిని తాగడం వల్ల గ్యాస్ ట్రబుల్ సమస్య తొందరగా తగ్గుతుంది. భోజనం తర్వాత మీ నోట్లో లవంగాలను వేసుకుని నమలడం వల్ల ఎసిడిటీని తగ్గిపోతుందట. లవంగాలు బీటా కెరోటిన్ కు అద్భుతమైన మూలం. కెరోటిన్ వర్ణ ద్రవ్యాలు విటమిన్ ఎ గా మారవచ్చు. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముఖ్యమైన పోషకం. లవంగాలలో బహుళ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి సయాటికా వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. యూజెనాల్ శరీరంలో తాపజనక ప్రతిస్పందనను తగ్గిస్తుంది. అలాగే సయాటికా వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని, వాటి లక్షణాలను నిర్వహించడానికి సహాయపడుతుందని తేలింది. చర్మ ఇన్ఫెక్షన్లు, అలెర్జీలను తగ్గించడమే కాకుండా లవంగాలు శరీరంలోని విషాన్ని కూడా బయటకు పంపుతాయి.

అలాగే లవంగాలు కూడా బరువు తగ్గడానికి సహాయపడతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. లవంగాలు మన జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. లవంగాలు కాలేయ పనితీరును మెరుగుపర్చడానికి కూడా సహాయపడతాయి. లవంగాలలో ఉండే యూజెనాల్ కాలేయ సిరోసిస్, కొవ్వు కాలేయ వ్యాధి లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. లవంగాలు కాలేయం పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. కాగా ప్రతిరోజూ ఖాళీ కడుపుతో లవంగాలు తినడం వల్ల ఎన్నో వ్యాధుల ప్రమాదం తగ్గుతుందట. అలాగే దంత ఆరోగ్యం కూడా బాగుంటుందట. లవంగాలు జీర్ణక్రియను కూడా బలంగా ఉంచుతాయని, ప్రతిరోజూ లవంగాలతో మరిగించిన నీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు.