వర్షాకాలంలో వాతావరణం ఎక్కువ శాతం చల్లగా ఉంటుంది. ఇలాంటి సమయంలో చాలామందికి చాయ్, బజ్జీలు ఇలా ఏదైనా వేడి పదార్థాలు తినాలని అనుకుంటూ ఉంటారు. చల్లటి వాతావరణం లో వేడివేడిగా చాయ్ తాగుతుంటే ఆ మజానే వేరు అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఒక కప్పు అల్లం టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మరి వర్షాకాలంలో అల్లం తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం..కాగా అల్లంలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధుల ప్రమాదాన్ని చాలావరకు తగ్గిస్తుంది.
ఇది రోగాలతో పోరాడేందుకు మీ శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే ఈ చాయ్ జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. అలాగే కడుపు ఉబ్బరం, అజీర్థి వంటి జీర్ణ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. వర్షాకాలంలో ఎక్కువ మొత్తంలో ఆయిలీ ఫుడ్ ను తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయట. అలాగ చాయ్ లో శోథ నిరోధక లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయట. అలాగే కండరాల నొప్పులను తగ్గిస్తాయి.
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే తేమ,చల్లని వాతావరణం వల్ల కీళ్ల నొప్పులు పెరుగుతాయని చెబుతున్నారు. అల్లం లో శరీరాన్ని వేడిక్కించే గుణాలు ఉంటాయి. ఈ టీ ని తాగడం వల్ల శరీరం వేడిక్కిన అనుభూతి కలుగుతుంది. ఇది వర్షాకాలం చలి, తేమను ఎదుర్కోవటానికి సహాయపడుతుందని కాబట్టి చలికాలంలో అల్లం టీ ను తాగడం చాలా మంచిదని చెబుతున్నారు. అలా అని ఎక్కువగా తాగడం అసలు మంచిది కాదు.