Castor Tree Leaves: ఆముదం చెట్టు, ఆకుల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే?

ఆముదం చెట్టు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఆముదం చెట్లు మనకు బయట అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి

  • Written By:
  • Publish Date - February 15, 2024 / 12:30 PM IST

ఆముదం చెట్టు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఆముదం చెట్లు మనకు బయట అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. కొందరు ప్రత్యేకంగా ఆముదం తోటలను సాగు చేస్తూ ఉంటారు. ఈ ఆముదం కాయలు మాత్రమే కాకుండా ఆకులు కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా వీటిని ఆయుర్వేదంలో ఉపయోగించి ఎన్నో రకాల మందులను తయారు చేస్తూ ఉంటారు. సాధారణంగా ఆముదం జిడ్డుగా ఉంటుందని దీన్ని ఎవరు ఉపయోగించరు. కానీ ఈ ఆముదం చెట్టులో బోలెడన్ని ఔషధ గుణాలు ఉంటాయి. ఈ చెట్టు ఆకులకి ఆయుర్వేద వైద్యంలో ఎంతో ప్రత్యేకత ఉంటుంది.

అనేక అనారోగ్య సమస్యలకు ఈ ఆముదం చెట్టు ఆకులు గింజలు సరైన పరిష్కార మార్గాలను చూపిస్తాయి. మరి ఇంకా ఏ ఏ ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే.. ఒక రకంగా చెప్పాలంటే అందరికీ ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి చెట్టుని దీని సంస్కృతంలో పంచాంగముల వర్ధమానాన్ని పిలుస్తూ ఉంటారు. మూడు రకాలు ఉంటాయి. ముఖ్యంగా ఎర్రముదాల చెట్టు, తెల్లాముదాల చెట్టు, పెద్ద ఆముదాల చెట్టు అనేటువంటి మూడు రకాలు ఉంటాయి. తెల్లాముదం చెట్లలో పెద్ద గింజలు కాచేదొకటి, చిన్న గింజలు కాచేది అంటే చిట్టాము రకం ఒకటి ఉంటాయి. తెళ్లా ఆముదం చెట్టు కన్నా ఎర్రముదం తో అధిక గుణగణాలు ఉంటాయి.

ఇది పక్షవాతంలాంటి వ్యాధులను కూడా నయం చేస్తుంది. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను నయం చేసే గుణం ఈ ఆముదం చెట్టులో ఉంటాయి. పక్షవాతానికి మలబద్దానికి ఈ ఆముదం చెట్టు అద్భుతంగా ఉపయోగపడుతుంది.దీని ఆకులు ముక్కలుగా చేసి బిడ్డల కడుపు స్థానం మీద రెండు మూడు సార్లు కనుక ఆకులతో రుద్దితే కడుపులో పురుగులన్నీ మలద్వారం గుండా బయటకు వచ్చేస్తాయి. అలాగే మూలవ్యాధిని నిర్మూలించడానికి లేత ఆముదపాకుని ఉపయోగిస్తారు. లేదా ఆముదపాకులు ఒక ముద్ద కర్పూరం బిళ్ళని కలిపి మెత్తగా నూరి కట్టు కడితే మూల వ్యాధి తొలగిపోతుంది. అలాగే రుతు చక్రవాగిపోయినటువంటి స్త్రీలకి ఆముదపాకుని కొంచెం నలగ కొట్టి వేడిచేసి గోరువెచ్చగా పొత్తికడుపు పైన పెడితే హరించుకుపోయి బహిష్టు వస్తుంది. అంతేకాదు నూనె ఆముదంతో తయారు చేసినటువంటి ఔషధాలు విరివిగా లభ్యమవుతున్నాయి.