Site icon HashtagU Telugu

Cashew Nuts : జీడిపప్పు గురించి ఈ విషయాలు మీకు తెలుసా ? ఎవరెవరు తినొచ్చు?

Cashews

Cashews

Cashew Nuts : డ్రై ఫ్రూట్స్ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది జీడిపప్పు, బాదంపప్పు. జీడిపప్పును ఎక్కువగా తింటే కొవ్వు పెరిగి ఇంకా లావు అవుతారన్నది కేవలం అపోహ మాత్రమేనంటున్నారు నిపుణులు. అన్ని డ్రై ఫ్రూట్స్ తో కలిపి జీడిపప్పును కూడా తింటే.. సరైన పోషకాలు శరీరానికి అందుతాయి. కేవలం డ్రైఫ్రూట్స్ తోనే కాకుండా.. వివిధ రకాల వంటల్లోనూ జీడిపప్పును వాడుతుంటారు. డ్రైఫ్రూట్స్ రారాజు జీడిపప్పు.

జీడిపప్పులో ప్రొటీన్, ఫైబర్, జింక్, మెగ్నీషియం, విటమిన్ బి, విటమిన్ కె, పొటాషియం వంటి ఎన్నో పోషకాలుంటాయి. జీడిపప్పును ప్రతిరోజూ ఒక మోతాదులో తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి, ఒత్తిడి, ఆందోళనతో బాధపడేవారు కూడా జీడిపప్పును తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. జీడిపప్పు తింటే బరువు పెరగరు. తగ్గుతారు. జీడిపప్పు తింటే ఎక్కువ సమయం ఆకలి అవ్వకుండా ఉంటుంది.

కంటిచూపు మెరుగవుతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యంగా తయారవుతాయి. సంతానలేమి సమస్యలు తగ్గుతాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాం. జీడిపప్పులో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. తగిన మోతాదులో మాత్రమే తినాలి. ఎక్కువగా తింటే కొవ్వుపెరిగి శరీర బరువు పెరిగే అవకాశం ఉంది. అలాగే మలబద్ధకం సమస్య కూడా రావొచ్చు. నెయ్యిలో వేయించి ఉప్పు, కారం, మసాలాలు చల్లుకుని తింటే.. అది కాస్తా అనారోగ్యానికి దారితీయొచ్చు. అలాగని పచ్చిగా కూడా తినకూడదు. బాదంపప్పు మాదిరిగా.. నీటిలో నానబెట్టి తింటే.. దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.