Site icon HashtagU Telugu

Cardamom: ఈజీగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే యాలకులతో ఇలా చేయాల్సిందే.

Mixcollage 16 Feb 2024 04 38 Pm 5728

Mixcollage 16 Feb 2024 04 38 Pm 5728

వంటింట్లో దొరికే మసాలా దినుసుల్లో యాలకులు కూడా ఒకటి. ఈ యాలకుల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికి తెలిసిందే. అలా చేస్తే శరీరానికి ఎలాంటి మెడిసిన్ తో పని ఉండదు. ఇది మానవ శరీరంలోని అవయవాలను శుద్ధి చేసి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇలా తీసుకోవడం వల్ల మలబద్ధకం వారికి ఆ సమస్య నుండి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా తిన్న ఆహారం కూడా బాగా జీర్ణం అవుతుంది. అలాగే నిద్రలో గురక శబ్దం చేసేవారు కూడా ప్రతిరోజు రాత్రి ఒక యాలికైన తిని వేడి నీళ్లు తాగడం వల్ల మెడిసిన్ లా పనిచేస్తుంది. అలాగే నిదానంగా నిద్రలో గురక తగ్గుతుంది.

చాలామంది రాత్రి నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. వారు ఈ చిట్కాలు వాడు చూడండి. మీ సమస్య వెంటనే మాయమవుతుంది. ఈ మధ్యకాలంలో బరువు తగ్గించుకోవడానికి అందరూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
అలాంటివారు ప్రతిరోజు ఒక యాలకుల తిని గోరువెచ్చని నీటిని తాగితే అధిక బరువును ఎంతో ఈజీగా తగ్గించుకోవచ్చు. శరీరంలో ఈ ఆలుకా హీట్ తత్వాన్ని కలిగించి అధిక కొవ్వుని కరిగిస్తుంది.

అంతేకాదు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ప్రతిరోజు ఇది తీసుకోవడం వల్ల ఎముకలను బలంగా మార్చుతుంది. ఇది చర్మాన్ని ఎలాంటి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఆరోగ్యంగా కాపాడుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఒత్తుగా పెంచేందుకు సహాయపడుతుంది. మనం తిన్న ఆహారాన్ని వెంటనే జీర్ణం చేసే గుణాలు యాలకుల్లో ఉంటాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రిక్ రుగ్మతలను ఎదుర్కొనే లక్షణాలు యాలకుల్లో ఉంటాయి. యాలకులు గుండెకు చాలా మంచివి. వీటిలో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. యాలకుల్లో ఉండే పొటాషియం గుండె పని తీరును, అధికరక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.