Site icon HashtagU Telugu

Butter Milk: వేసవికాలంలో ఒక గ్లాస్ మజ్జిగ తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా?

Butter Milk

Butter Milk

మండే ఎండల్లో చాలా వరకు ఆహార పదార్థాల కంటే పానీయాలు ఎక్కువగా తాగుతూ ఉంటారు. అటువంటి వాటిలో మజ్జిగ కూడా ఒకటి. వేసవి కాలంలో ఎక్కడ చూసినా కూడా అతి తక్కువ ధరకే మజ్జిగను ఎక్కువగా విక్రయిస్తూ ఉంటారు. మజ్జిగ తాగడం వల్ల ఎండాకాలంలో అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే వేసవిలో మజ్జిగను తాగితే ఏం జరుగుతుందో ఎటువంటి ఫలితాలు కడుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..కాగా మన శరీరానికి కాల్షియం చాలా చాలా అవసరం.

ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం, మన శరీరంలో తగినంత కాల్షియం ఉంటేనే ఎముకలు, దంతాలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. కాగా మజ్జిగలో కాల్షియం పుష్కలంగా ఉంటుందట. ఇది ఎముకల సమస్యలు రాకుండా చూస్తుందట. మన శరీరంలో విషాలు పేరుకుపోతాయి. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే రోజూ ఒక గ్లాస్ మజ్జిగను తాగడం వల్ల మీ కాలేయం, శరీరంలోని విషయాలు బయటకు పోతాయట. దీంతో మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు అని చెబుతున్నారు. ఎండాకాలంలో చాలా మందికి ఉదర సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.

అయితే ఈ సీజన్ లో మీరు రోజూ ఒక గ్లాసు మజ్జిగను తాగడం వల్ల బాడీ హీట్ తగ్గుతుందట. అలాగే కడుపు ఉబ్బరం, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కూడా లభిస్తుందని చెబుతున్నారు. కాగా మజ్జిగ మన చర్మానికి కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుందట. మజ్జిగలో విటమిన్ సి, విటమిన్ బి లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా, షైనీగా ఉంచుతాయట. అలాగే చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయని చెబుతున్నారు. రోజూ మజ్జిగను తాగితే మీ చర్మ సమస్యలు కూడా తగ్గిపోతాయట. మజ్జిగను తాగితే బరువు కూడా తగ్గవచ్చట. ఎందుకంటే దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది మీ ఆకలిని తగ్గిస్తుందట. అలాగే మీరు బరువు పెరగకుండా నియంత్రించడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు.