Site icon HashtagU Telugu

Health Benefits: ఉదయాన్నే టీకి బదులుగా ఆ జ్యూస్ తాగితే చాలు.. ఎన్నో ప్రయోజనాలు?

Mixcollage 21 Dec 2023 08 27 Pm 3571

Mixcollage 21 Dec 2023 08 27 Pm 3571

ఉదయం లేవగానే మనలో చాలామందికి టీ కాఫీలు తాగే అలవాటు. కొందరు బ్రష్ చేసుకున్న తర్వాత ఇదే మరికొందరు బెడ్ కాఫీలు టీలు తాగుతూ ఉంటారు. అలా టీ, కాఫీలకు ఈ రోజుల్లో మనుషులు బాగా ఎడిక్ట్ అయిపోయారు. అయితే టీ కాఫీలు తాగడం మంచిదే కానీ పరగడుపున తాగడం అస్సలు మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదయాన్నే టీ కాఫీ లకు బదులుగా ప్రత్యామ్నాయంగా వేరేవి తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు. అటువంటి వాటిలో మనం తెలుసుకోబోయే జ్యూస్ కూడా ఒకటి. ఆ జ్యూస్ మరేదో కాదు సొరకాయ జ్యూస్. మరి ఉదయాన్నే సొరకాయ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సొరకాయ జ్యూస్ టేస్టీగా అనిపించకపోయినప్పటికీ ఆరోగ్యానికి చాలా మంచిది. తరచుగా ఎక్ససైజ్ చేసుకునేవాళ్లకు తప్పక ఈ సొరకాయ జ్యూస్ ని తీసుకోవాలి. ఇది మీకు చాలా మేలు చేస్తుంది. పాల జ్యూస్ లో సహజ చక్కర కలిగి ఉంటుంది. ఇది గ్లైకోజన్ లెవెల్స్ ను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్ సమస్య ఉన్నట్లయితే, మీరు నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు దానికోసం సొరకాయ జ్యూస్ ని తీసుకోవచ్చు. ఖాళీ కడుపుతో సొరకాయ జ్యూస్ తీసుకోవడం వలన శరీరానికి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. సొరకాయ జ్యూస్ లో 98 శాతం వాటర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం నుండి విషాన్ని బయటికి పంపిస్తాయి.

అదేవిధంగా మల బద్ధకంతో ఇబ్బంది పడే వాళ్ళకి ఈ సొరకాయ జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రధానంగా కిడ్నీలో రాళ్లు యూరినరీ ఇన్ఫెక్షన్స్ మూత్ర సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడేవారు నిత్యము సొరకాయ జ్యూసు త్రాగడం వలన మంచి ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారో వాళ్లకి ఈ జ్యూస్ తాగడం వల్ల ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఈ జ్యూస్ తాగడం వలన రక్తంలో చక్కెర లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. అధిక వేడితో బాధపడేవాళ్లు సొరకాయ జ్యూస్ తో క్షణాల్లో శరీరం కూల్ అవుతుంది. నిత్యం సొరకాయ జ్యూస్ ని తీసుకోవడం వలన అధిక రక్తపోటు వ్యాధి కూడా అలాగే సొరకాయ జ్యూస్ తో అధిక బరువు కూడా తగ్గుతారు. అలాగే మలబద్ధకం దూరమవుతుంది. జుట్టు తొందరగా తెల్లబడకుండా ఉంటుంది. అదేవిధంగా శరీరానికి ఎంతో శక్తిని కూడా ఇస్తుంది. లివర్ ని శుభ పరుస్తుంది. మలబద్ధకం దూరమవుతుంది.