Health Benefits: మరిగించిన నిమ్మకాయ నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

నిమ్మకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. వేసవి కాలంలో చా

Published By: HashtagU Telugu Desk
Mixcollage 15 Dec 2023 04 46 Pm 1087

Mixcollage 15 Dec 2023 04 46 Pm 1087

నిమ్మకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. వేసవి కాలంలో చాలామంది ఎండ నుంచి ఉపశమనం పొందడం కోసం లెమన్ వాటర్ తాగుతూ ఉంటారు. అయితే కేవలం మామూలు నిమ్మకాయ నీరు వల్ల మాత్రమే కాకుండా మరిగించిన నిమ్మకాయ నీరు వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు వైద్యులు. మరిగించిన నిమ్మకాయ నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలతో పాటు పలు రకాల అనారోగ్య సమస్యలు కూడా తగ్గ ముఖం పడతాయి. నిమ్మకాయలో విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

నిమ్మరసంలో ఉప్పు వేసుకొని తీసుకోవచ్చు. మరి మరిగించిన నిమ్మకాయ నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల విషయానికొస్తే.. మరిగించిన నిమ్మకాయ నీటిని తీసుకోవడం వలన జీర్ణం వ్యవస్థ, చర్మ సంబంధ సమస్యలు తగ్గిపోతాయి. అలాగే ఉడకబెట్టిన నిమ్మకాయ నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉదయం పరిగడుపున ఉడికించిన నిమ్మరసం తీసుకుంటే శరీరాన్ని మరింత మేలు జరుగుతుంది. నీటిని మరిగించి అందులో సగం నిమ్మకాయను పిండుకోవాలి. కాసేపు మరిగించిన తర్వాత దానిని తీసి చల్లార్చిన తర్వాత తీసుకోవాలి. ఈ నిమ్మకాయ నీటిని నుండి మీరు చాలా ఆరోగ్య ఉపయోగాలు పొందుతారు. వేడి నిమ్మరసం చేయడానికి మీరు మరొక పద్ధతిని కూడా పాటించవచ్చు.

ఒక గిన్నెలో నీటిని మరిగించి శుభ్రంగా కడిగిన ఆరు నిమ్మకాయలు వేయాలి కనీసం ఐదు నిమిషాల పాటు మరిగించాలి. అది చల్లారిన తర్వాత మీరు దానిని తీసుకోవచ్చు. ఇది మీరు నిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మ సంబంధతిత సమస్యలు ను కూడా నయం చేస్తుంది. అలాగే మీ ముఖంపై మచ్చలతో ఇబ్బంది పడుతుంటే నిమ్మరసం నీరు వాటిని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. మరిగించిన నిమ్మరసం శరీరంలో శక్తిని పెంచుతుంది. అదేవిధంగా ఇది వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడంలో బాగా ఉపయోగపడుతుంది. దీనిలో విటమిన్ సి శరీరాన్ని డిటాక్షన్ పై చేయడం వలన రోగ నిరోధక శక్తి బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. కరోనా యొక్క కొత్త వైవిధ్యాలను తగ్గించడానికి మీరు ఇంట్లోనే ఉండి మీ రోగనిరోధక శక్తిని బలోపితం చేసుకోండి. నిమ్మరసంతో మరిగించిన నిమ్మరసం తీసుకోవడం వలన బరువు తగ్గుతారు. నిమ్మరసంలో తేనె కలిపి తీసుకోవడం వలన శరీరంలోని కొవ్వు త్వరగా కరుగుతుంది.

  Last Updated: 15 Dec 2023, 04:47 PM IST