Site icon HashtagU Telugu

Black Turmeric: నల్ల పసుపు ఎప్పుడైనా తిన్నారా.. దీంతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే!

Black Turmerid

Black Turmerid

మామూలుగా పసుపు అనగానే మనకు ఎల్లో కలర్ పసుపు ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటుంది. కానీ నల్ల పసుపు కూడా ఉంటుంది అన్న విషయం చాలామందికి తెలియదు. ఈ నల్ల పసుపుని ఇండియాలో ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఈ నల్ల పసుపు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మరి నల్ల పసుపు ఆరోగ్యానికి ఇంకా ఎలాంటి ప్రయోజనాలను కలిగిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నల్ల పసుపు మన జీర్ణక్రియకు ఎంతో సహాయపడుతుంది.

ఇది ఉదర సమస్యలను తగ్గించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేసుందని చెబుతున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట. గ్యాస్ట్రిక్, కడుపు నొప్పి వంటి సమస్యలను కూడా ఇది తగ్గిస్తుందట. ఇందుకోసం నల్ల పసుపు పొడిని నీళ్లలో కలిపి తాగాలని చెబుతున్నారు. అలాగే కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడేవారు నల్ల పసుపును తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. నల్ల పసుపును కీళ్ల నొప్పులకు అప్లై చేస్తే కాస్త ఉపశమనం లభిస్తుందట. ఇందుకోసం నల్ల పసుపులో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లా చేసి చేసి కీళ్లనొప్పులు ఉన్నచోట అప్లై చేయాలట.

నల్ల పసుపు కూడా చర్మానికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పసుపు మొటిమలను, నల్ల మచ్చలను పోగొట్టి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అలాగే ముఖానికి అంటుకున్న మురికిని కూడా పోగొడుతుందట. ఇందుకోసం కొద్దిగా నల్ల పసుపును తీసుకుని అందులో తేనె కలిపి ముఖానికి అప్లై చేయాలని చెబుతున్నారు. గాయాలు తగ్గడానికి మనం ఎన్నో రకాల స్కిన్ క్రీమ్స్ ను వాడుతుంటాం. అయితే గాయాలు సహజంగా తగ్గాలంటే మాత్రం నల్ల పసుపును ఉపయోగించండి. ఇందుకోసం నల్ల పసుపును పేస్ట్ గా చేసి ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయండి. ఇది మీ గాయలను త్వరగా నయం చేస్తుంది.