Black Pepper: లావు తగ్గాలనుకుంటున్నారా.. అయితే మిరియాలతో ఇలా చేయండి?

మన వంటింట్లో దొరికే మసాలా దినుసుల్లో మిరియాలు కూడా ఒకటి. మిరియాల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు

  • Written By:
  • Publish Date - February 14, 2023 / 06:30 AM IST

మన వంటింట్లో దొరికే మసాలా దినుసుల్లో మిరియాలు కూడా ఒకటి. మిరియాల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. మిరియాల ను ఎన్నో రకాల వంటలలో ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి వంటలకు టేస్ట్ ని పెంచడంతో పాటు ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. అలాగే మిరియాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి, మిరియాలు తాగడం వల్ల బరువు తగ్గుతారా లేదా అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో ఒక చిటికెడు నల్ల మిరియాల పొడి కలిపి తాగాలి.

చిటికెడు కంటే ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. ఎందుకంటే మన ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగుతున్నాము కాబట్టి చాలామందికి వాంథింగ్ వచ్చినట్టు కూడా అనిపించవచ్చు. అలాగే ఎసిడిటీ ప్రాబ్లం కూడా రావచ్చు.శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలను నిర్మూలించడంలో మిరియాల నీళ్లు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. దీంతో జీర్ణ వ్యవస్థ మెరుగుపడి, పేగు సంబంధిత సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంది. జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యల నుంచి బయట పడడానికి మిరియాల నీళ్లు ఉపయోగపడతాయి. ముఖ్యమైనది రోగ నిరోధక శక్తి పెంపుదల. మిరియాల నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

అనుకోకుండా వచ్చే ఆరోగ్య సమస్యల పై పోరాడడానికి అవసరమైన ఇమ్యూనిటీని ఈ మిరియాల నీళ్లు మనకి అందిస్తాయి. అలాగే, మిరియాల నీటి వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే హానికారక వ్యర్ధాల నిర్మూలన. మిరియాల నీటితో చేకూరే మరో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే అధిక బరువు తగ్గడం. అదే విధంగా మల బద్దకాన్ని నివారించడంలో మిరియాల నీళ్లు ఉపయోగపడతాయి. దీర్ఘ కాలికంగా మల బద్దకంతో ఇబ్బందిపడేవారు ఈ మిరియాల నీళ్లు తీసుకోవడం ద్వారా సమస్య నుంచి బయటపడొచ్చు. అధిక క్యాలరీలను ఖర్చయ్యేలా చేసి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇక శరీరాన్ని తేమగా ఉంచడంలో మిరియాల నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో తోడ్పడి, కాంతివంతంగా కనిపిపించేలా చేస్తాయి. మిరియాల నీటిని తాగడం అనేది మన రోజువారీ జీవన శైలిలో ఒక భాగంగా చేసుకుంటే చాలా మంచిది.