Site icon HashtagU Telugu

Black Grapes: వామ్మో.. నల్ల ద్రాక్ష వల్ల ఏకంగా అన్ని రకాల లాభాలా.. అవేంటో తెలుసా?

Black Grape

Black Grape

మామూలుగా మనకు మార్కెట్లో రెండు రకాల ద్రాక్ష లభిస్తూ ఉంటుంది. అందులో ఒకటి ఆకుపచ్చని తెల్ల ద్రాక్ష అయితే ఇంకొకటి నల్ల ద్రాక్ష. వీటిలో నల్లద్రాక్ష ఎక్కువ తీపి కలిగి ఉంటుంది. ఎక్కువ శాతం మంది ఈ నల్ల ద్రాక్షనే తింటూ ఉంటారు. నల్ల ద్రాక్ష వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీనిని తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలగడంతో పాటు, ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. నల్లద్రాక్షలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రెస్వెరాట్రాల్, ఫ్లేవనాయిడ్ష్, ఆంథోసైనిన్స్ వంటి పవర్‌ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడి నుండి శరీరాన్ని కాపాడుతుందట.

ఈ నల్ల ద్రాక్ష తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలగడంతో పాటుగా ఎన్నో రకాల సమస్యలకు కూడా పెట్టవచ్చని చెబుతున్నారు. నల్లద్రాక్షలో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పెంచి ఇన్ఫెక్షన్స్‌ ని దూరం చేస్తుంది. అదేవిధంగా ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడి, బోలు ఎముకల సమస్య రాకుండా చేస్తుంది. ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి బాడీలోని ఫ్రీ రాడికల్స్‌ ని బ్యాలెన్స్ చేస్తాయి. దీంతో కొంత వరకూ క్యాన్సర్ తగ్గుతుంది. కాబట్టి వీటిని తీసుకోవడం మంచిది. అదే విధంగా నల్లద్రాక్షలో ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి సమ్మేళనాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.

వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సంబంధిత సమస్యల్ని కూడా తగ్గిస్తాయి. క్షీణత, కంటి శుక్లం వంటి ప్రమాదాలు కూడా దూరమవుతాయని చెబుతున్నారు. ​నల్లద్రాక్షలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకి హెల్ప్ చేస్తుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యల్ని కూడా కూడా తగ్గిస్తుంది. దీంతో కేలరీలు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ పండ్లు తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. అతిగా తినకుండా ఉంటారు. దీంతో బరువు తగ్గుతారు. నల్లద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్స్ మంట, చెడు కొలెస్ట్రాల్‌ ని తగ్గిస్తాయి. అలాగే ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి దీన్నీ తరచుగా తినడం మంచిది. నల్లద్రాక్షలో పొటాషియం రక్త పోటుని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. రక్తపోటుని తగ్గించడం వల్ల స్ట్రోక్ ప్రమాదం కూడా తగ్గుతుంది. కాబట్టి, వీటిని తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. కాబట్టి నల్ల ద్రాక్షను మీ డైట్ లో బాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మంచిదే కదా అని ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పవు.