Black Coffee: బ్లాక్ కాఫీతో బరువు తగ్గడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు.. అవేంటంటే?

ప్రతి రోజు చాలామంది వారిదైనందిన జీవితాన్ని కాఫీ లేదా టీ లతో మొదలు పెడుతూ ఉంటారు. రోజులో కనీసం ఒక్కసారి

  • Written By:
  • Updated On - November 15, 2022 / 12:02 PM IST

ప్రతి రోజు చాలామంది వారిదైనందిన జీవితాన్ని కాఫీ లేదా టీ లతో మొదలు పెడుతూ ఉంటారు. రోజులో కనీసం ఒక్కసారి అయినా టీలు కాఫీలు లేకపోతే ఏదో కోల్పోయినట్టు పిచ్చి పట్టినట్టుగా ఉంటుంది. అంతలో మనుషులు కాఫీలు టీలకు ఎడిక్ట్ అయిపోయారు. అయితే ఈ కాఫీలు టీలు ఆరోగ్యానికి మంచిదే కానీ పరిమితికి మించి తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి అన్న విషయం తెలిసిందే. ఇకపోతే కాఫీ విషయానికొస్తే..కాఫీ అధిక బరువును నియంత్రించడంలో బాగా సహాయపడుతుంది. ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆఫీస్ వర్కులు అంటూ అర్ధరాత్రి వరకు మేల్కొని వర్క్ చేస్తూ ఉంటారు.

అర్ధరాత్రి వరకు మేలుకొని పనిచేసే వారు, తెల్లవారుజామున లేచి పనిచేసుకునే వారికి కాఫీ తాగడం గొప్ప పరిష్కారం అని చెప్పవచ్చు. కాఫీ మనల్ని చురుగ్గా అప్రమత్తంగా ఉంచడంతో పాటు మరుగును తగ్గడానికి కూడా సహాయపడుతుంది. మరి ముఖ్యంగా బ్లాక్ కాఫీలో ఎక్కువ కెఫిన్, ఓదార్పు వాసన ఉంటుంది. మరి బ్లాక్ కాఫీ వల్ల ఇంకా ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్లాక్ కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ అనే పదార్ధం మీ అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. బ్లాక్ కాఫీ ను తాగడం వల్ల రాత్రి భోజనం తర్వాత శరీరంలో గ్లూకోజ్ ఉత్పత్తిని ఆలస్యం చేస్తుంది.

అదనంగా ఇది కొత్త కొవ్వు కణాల పెరుగుదలను కూడా నిరోధిస్తుంది. దీనివల్ల శరీరంలో కేలరీలు తగ్గుతాయి. కాఫీలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే బ్లాక్ కాఫీ బరువును తగ్గించడానికి అలాగే శరీరంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. కాఫీలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇది శరీరంపై వివిధ ప్రభావాలను చూపుతుంది. కెఫిన్ మన మెదడు, కేంద్ర నాడీ వ్యవస్థను చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే మెమరీ పవర్ లెవల్స్‌ ను మెరుగుపరుస్తుంది. అదేవిధంగా ఆకస్మిక ఆకలి బాధలను నియంత్రించడంలో సహాయపడుతుంది.