Site icon HashtagU Telugu

Black Coffee: ఉదయాన్నే కప్పు బ్లాక్ కాఫీని తాగడం వల్ల కలిగే లాభాలు ఇవే!

Black Coffee

Black Coffee

మామూలుగా మనలో చాలామంది ఉదయనే కాపీ టీ లతో పాటుగా బ్లాక్ కాఫీ ని కూడా తాగుతూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది ఉదయాన్నే ఎక్కువగా బ్లాక్ కాఫీ తాగుతుంటారు. ఈ బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బ్లాక్ కాఫీలో సహజంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి 2, విటమిన్ బి 3, మెగ్నీషియం, పొటాషియం, సోడియం పుష్కలంగా ఉంటాయి. దీనిలో కేలరీలు ఉండవు. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందనీ చెబుతున్నారు. ఈ బ్లాక్ కాఫీ మీ జీవక్రియను పెంచుతుందట. అల్జీమర్స్ వ్యాధి అనేది మెదడు సమస్య.

ఇది జ్ఞాపకాలు, ఆలోచనా నైపుణ్యాలను నాశనం చేస్తుంది. దీనివల్ల రోజు వారి పనులను కూడా మర్చిపోతుంటాం. అయితే బ్లాక్ కాఫీ తాగడం అల్జీమర్స్ వ్యాధి ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 2 నుంచి 3 కప్పుల కాఫీని తాగడం వల్ల చిత్తవైకల్యం, అల్జీమర్స్ ప్రమాదం 65 శాతం తగ్గుతుందని చెబుతున్నారు. రెండు కప్పులు తాగడం వల్ల కాలక్రమేణా ఈ ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ కాఫీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చట. బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల సానుకూల ప్రభావాలు ఉంటాయట. ఇందులో ఉండే క్లోరోజెనిక్ ఆమ్లాలు బరువు తగ్గడానికి సహాయపడతాయని చెబుతున్నారు. శరీరంలో గ్లూకోజ్ ఉత్పత్తిని నెమ్మదిస్తాయట. కొత్త కొవ్వు కణాల నిర్మాణాన్ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

దీంతో మీరు సులువుగా బరువు తగ్గవచ్చు. అయితే దీనిలో చక్కెర కలపకపోతే కేలరీలు తక్కువగా ఉంటాయట. జిమ్ కు వెళ్లే ముందు బ్లాక్ కాఫీ ని తాగడం వల్ల మీరు వ్యాయామాన్ని మరింత మెరుగ్గా చేసుకోగలుగుతారట. వ్యాయామానికి ముందు బ్లాక్ కాఫీ అలసటను తగ్గించి, ఏకాగ్రత ,శక్తి, పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ కాఫీ వ్యాయామం సమయంలో చురుకుదనాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి వ్యాయామానికి ముందు దీనిని తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. రోజుకు 2 నుంచి 3 కప్పుల కంటే ఎక్కువ బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయట. ఇది మీ నిద్ర చక్రానికి అంతరాయం కలిగిస్తుందట. అలాగే నిద్ర రుగ్మతలకు దారితీస్తుంది. ఇందులో కెఫిన్ ఎక్కువగా ఉండటం వల్ల బ్లాక్ కాఫీని తీసుకోవడం వల్ల అసిడిటీ, మలబద్ధకం, నిద్రలేమి వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుందట. కాబట్టి రోజుకు 2-3 కప్పుల బ్లాక్ కాఫీని మాత్రమే తాగాలని చెబుతున్నారు.