Site icon HashtagU Telugu

Biryani leaves: ఏంటి.. బిర్యానీ ఆకుల వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలా?

Mixcollage 18 Feb 2024 08 56 Pm 6845

Mixcollage 18 Feb 2024 08 56 Pm 6845

మామూలుగా మనం బిర్యాని చేసినప్పుడు అలాగే కొన్ని రకాల మసాలా వంటలు చేసినప్పుడు బిర్యాని ఆకుని వినియోగిస్తూ ఉంటాం. ఈ బిర్యానీ ఆకులు కూరకు రుచిని పెంచడంతోపాటు ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. బిర్యానీ ఆకుల్లో విటమిన్ సి, విటమిన్ ఏ, మాంగనీస్, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈ బిర్యానీ ఆకులు వేసి మరిగించి ఆకులను తీసి కషాయాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. రెండు గ్లాసులు వాటర్ తీసుకోవడం వల్ల మధుమేహం కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి.

ఇలా వాసన ద్వారా మనకు కలిగే రుగ్మతలు తొలగుతాయి. ఏదైనా సువాసన ద్వారా వ్యాధులను నయం చేయటం ప్రకృతి వైద్యులు ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ప్రకృతి వైద్యులు చేసే వలన మనసుకు ఎంతో ప్రశాంతత చేకూర్తుంది. మనం నిత్యం వంటకాలలో వాడే ఆకులు కాల్చడం వలన వచ్చే పొగని పీల్చడం వల్ల కూడా మన మనసుకు ప్రశాంతత చేకూర్తుంది. అదే బిరియాని ఆకు బిర్యానీ తినే వారికి ఈ ఆకు సుపరిచితమే ఈ ఆకులు ఉపయోగించడం వలన బిర్యాని మంచి వాసన వస్తుంది. రెండు లేదా మూడు బిర్యానీ ఆకులని తీసుకొని వాటిని ఒక గదులో కాల్చండి. వాటి నుండి పొగ వచ్చే సమయంలో బయటకు వెళ్లి గది తలుపులు మూసివేయండి.

అలా ఒక పది నిమిషాల పాటు ఉంచండి. ఆ వాసన పిలిస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి ఆందోళన అంతా మటుమాయమవుతుంది. అంతేకాదు గది అంతా సువాసన భరితంగా ఉంటుంది. దోమలు, పురుగులు ఏమైనా ఉంటే కూడా పారిపోతాయి. అంతేకాదు ఈ బిర్యానీ ఆకు బొద్దింకలను తరిమికొట్టడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటిలోని ఆమ్లాలు క్యాన్సర్ రాకుండా అరికడతాయి. అలాగే పది బిర్యానీ ఆకులని తుంచి మూడు కప్పుల నీళ్లలో వేసి వాటిని ఒక కప్పు అయే వరకు మరిగించి చల్లారక రోజు రాత్రిపూట తీసుకుంటే కొలెస్ట్రాల్ ,మధుమేహం వంటి వ్యాధులు తగ్గుముఖం పడతాయి.